నైజాంలో కల్కి డే 6 వసూళ్లు ఏంతో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి 2898 ఎడి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంటుంది. భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా లో దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటాని వంటి స్టార్ నటినటులు  కీలకమైన పాత్రను పోషించారు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఈ సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకుల దగ్గర నుండి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లో కూడా

 ఈ సినిమా భారీ వసులను అందుకుంటుంది. ఇప్పటికే హిందీ వర్షన్ లో ఈ సినిమా రికార్డు స్థాయిలో రూ.100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడు నైజం మార్కెట్ కి సంబంధించిన ఒక తాజా వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయి 6 రోజుల రన్  ని పూర్తి చేసుకోగా డే 6 లో నే ఈ మూవీ నైజాంలో రూ.3.65 కోట్ల షేర్ ని రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఇక దీనితో కలిపి ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ.54 కోట్ల దగ్గర షేర్ ని అందుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకి వీకెండ్ బాగా కలిసి రావడంతో భారీ సక్సెస్

 ను అందుకుంటుంది. ప్రస్తుతానికి టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ తాజాగా నటించిన కల్కి  సినిమా రన్ బాగానే కంటిన్యూ అవుతుండగా లాంగ్ రన్ లో ఈ మూవీ ఎక్కడ ఆగుతుందో చూడాలి మరి. దీంతో ప్రభాస్ మరో రికార్డు మూవీను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ఈ సినిమాతో ఆయనకి మరింత హైప్ పెరిగిపోయింది. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంతోష్ నారాయణన్ అద్భుతమైన సంగీతాన్ని అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహించిన విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: