దేవర మ్యూజిక్ ఆల్బమ్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్.. ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషి..?

MADDIBOINA AJAY KUMAR
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన నేపథ్యం లో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా నుండి ఒక పాటను కూడా విడుదల చేశారు.

దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాలు నుండి లభించింది. ఇక ఈ మూవీ లోని రెండవ పాటను కూడా విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరో 10 , 15 రోజుల్లో ఈ సినిమా నుండి రెండవ పాటను విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం వారు ఉన్నట్టు తెలుస్తోంది. కాస్త అటు ఇటు అయిన ఈ నెలలోనే ఈ మూవీ నుండి రెండవ పాట మాత్రం ఆల్మోస్ట్ విడుదల చేయడానికి మూవీ బృందం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన మొదటి పాట అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ లోని సెకండ్ సాంగ్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలోని రెండవ పాట ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించి ఉండడంతో వీరి కాంబోలో రూపొందుతున్న దేవర మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: