
కష్టాల్లో ఉన్నప్పుడు మెగా కుటుంబం అండగా నిలబడింది.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్..!
అయితే జులై రెండున ఆయన పుట్టినరోజు తర్వాత మెగా ఫ్యామిలీ గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అంతే కాదు రామ్ చరణ్ ఉపాసనతో తీసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.." సరైన సమయంలో సాయం చేసేవాడు దేవుడు. నా పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ అన్న తన ఇంటికి పిలిచినప్పుడు వారికి నా మీద ఉన్న ప్రేమకి చాలా సంతోషపడ్డ. ప్రజెంట్ అక్కడికి వెళ్లాక మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీర్వాదంతో పాటు చరణ్ అన్నా ఉపాసన వదినా నాకు ఇచ్చిన మాటకి నా సంతోషం వందరెట్లు పెరిగింది.
నేను ఇదివరకు అడిగినా సహాయాన్ని గుర్తించుకుని నా డాన్సర్ యూనియన్ టి.ఎఫ్.టి.టి.డీ.ఎ లో 500+ కుటుంబాలకి హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా వారు అండగా నిలబడ్డారు. అడిగిన సహాయాన్ని గుర్తించుకుని ఇచ్చిన మాటకి విలువిస్తూ అని కుటుంబాలని చేరదీయడం మామూలు విషయం కాదు. మా అందరి మనసులలో కృతజ్ఞత భావం ఎల్లకాలం ఉంటుంది. మా అందరి తరపు నుంచి అన్న అండ్ వదినలకి మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నాం " అంటూ హాట్ వీక్ లో పేర్కొన్నారు జానీ మాస్టర్. ఇక ప్రజెంట్ యోని మాస్టర్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రజెంట్ ఈ పోస్ట్ ని చూసిన మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.