నేను రిటైర్మెంట్ ప్రకటించలేదు.. క్లారిటీ ఇచ్చిన స్టార్ క్రికెటర్?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ మొన్నటికి మొన్న ముగిసిన టి20 వరల్డ్ కప్ టోర్నీ.. ఎంతలా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్కంఠ   భరితంగా సాగుతూ అసలు సిసలైన క్రికెట్ మజాని అందించింది అని చెప్పాలి. ఇలా రసవత్తరంగా  సాగిన వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్లో సౌత్ ఆఫ్రికా ను ఓడించిన టీమ్ ఇండియా టైటిల్ విజేతగా నిలిచి విశ్వ విజేతగా అవతరించింది అని చెప్పాలి.

 అయితే ఇలా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసి టీమిండియా టైటిల్ గెలిచిన వెంటనే భారత జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆ మరునాడు ఏకంగా టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టి20 నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఇదే సమయంలో ఇక సౌత్ ఆఫ్రికా విధ్వంసకర ప్లేయర్ డేవిడ్ మిల్లర్ సైతం అంతర్జాతీయ టి20 కెరీర్ కు వీడ్కోలు పలికినట్లు వార్తలు వచ్చాయి.

 అయితే డేవిడ్ మిల్లర్ ఇలా రిటైర్మెంట్కు సంబంధించిన ప్రకటన చేసినట్లు అటు సోషల్ మీడియాలో పోస్టులు కానీ లేదంటే మీడియా సమావేశాలలో ఎక్కడ వీడియోలు లేకపోవడంతో ఈ విధ్వంసకర ఆటగాడి రిటైర్మెంట్ నిజమేనా అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలిగింది. అయితే ఈ విషయంపై డేవిడ్ మిల్లర్ స్పందించాడు. తాను టీ20 క్రికెట్ కెరీర్ కు రిటర్మెంట్ ప్రకటిస్తున్నట్లు వచ్చిన వదంతులు నిజం కాదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇటీవల ముగిసిన టి20 వరల్డ్ కప్ ఆయనకు చివరిది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే వీటిపై సోషల్ మీడియా వేదికగా మిల్లర్స్ స్పందించాడు. నేను టి20 ఫార్మాట్ నుంచి వైదొలగడం లేదు. దక్షిణాఫ్రికా తరపున నా సేవలు కొనసాగిస్తా. నా నుంచి ఇంకా మంచి ప్రదర్శన రావాల్సి ఉంది అంటూ మిల్లర్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: