ఇంస్టాగ్రామ్ లో ఎక్కువమంది లైక్ చేసిన ఫోటో ఇదే..!
ఇక ఈ సంబరాన్ని దేశమంతా ఓ పండగలాగా జరుపుకొండి. ఆ కళ్ళు చెదిరే విజయానికి సంబంధించిన ఫోటోలు అండ్ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అందులో రోహిత్ శర్మ ట్రోఫీ అందుకోగా మిగిలిన టీమంతా సంబరాలు జరుపుకుంటున్న ఫోటోను విరాట్ కోహ్లీ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇక ఈ ఫోటోకు ఇప్పుడు ఏకంగా 1.8 కోట్ల లైక్స్ రావడం.
ఇప్పుడీ ఫోటోని ఇండియాలో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ మంది లైక్ చేసిన ఫోటోగా మారింది. ఇన్నాళ్లు బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ సిద్ధార్థ మల్హోత్రా అండ్ కియారా అద్వాని పెళ్లి ఫోటో పేరిట ఈ రికార్డ్ ఉండేది. ఇక ఆ ఫోటోకు 1.6 కోట్ల లైక్స్ వచ్చాయి. కోహ్లీ షేర్ చేసిన ఫోటో ఒక్క రోజులోనే ఈ రికార్డు బ్రేక్ చేసింది. " ఇలాంటి రోజు నువ్వు మించిన రోజును నేను కోరుకోలేదు. దేవుడు గొప్పోడు. ఆయన ముందు నేను తల వంచి నమస్కరిస్తున్నాను. మేము చివరికి సాధించాము. జై హింద్ " అనే క్యాప్షన్ తో కోహ్లీ ఈ ఫోటోని షేర్ చేశాడు.