ఆరోజే క్లీంకార ఫోటోను రివీల్ చేస్తాను.. అన్ స్టాపబుల్ చరణ్ ప్రోమో అదిరిపోయిందిగా!
చిరు, పవన్, నాగబాబులలో పార్టీకి ఎవరితో వెళ్తావని బాలయ్య చరణ్ ను అడగగా వాళ్లతో కాదని అల్లు అరవింద్ మావయ్యతో వెళ్తానని చరణ్ పేర్కొన్నారు. 2023లో చిరంజీవి గారికొ కొడుకుగా మంచి బహుమతి ఇచ్చావని బాలయ్య చరణ్ తో కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏరోజు క్లీంకార నాన్న అని పిలుస్తుందో ఆరోజు క్లీంకార ఫోటోను రివీల్ చేస్తానని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం.
రామ్ చరణ్ స్నేహితులైన శర్వానంద్ విక్రమ్ ఈ షోకు గెస్ట్ లుగా హాజరయ్యారు. పవన్ యాక్టర్ గా బెటరా? పొలిటీషియన్ గా బెటరా? అని బాలయ్య చరణ్ ను ప్రశ్నించారు. ఉపాసన అంటే భయమా అని అడగడంతో పాటు యాక్టర్ గా మహేష్ కంఫర్టబులా? ప్రభాస్ కంఫర్టబులా? అని అడిగారు. నాగవంశీ ఏంటమ్మా పింక్ ప్యాంట్ అంటాడని దిల్ రాజును ప్రశ్నించగా ఆ ప్యాంట్ తీసేశానని దిల్ రాజు తెలిపారు.
బాలయ్య ప్రభాస్ కు ఫోన్ కాల్ చేయగా ప్రభాస్ ఏం చెప్పాడో తెలియాల్సి ఉంది. ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులు సైతం ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య డాకు మహరాజ్ ట్రైలర్ తాజాగా విడుదల కాగా ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. స్టార్ హీరో బాలయ్య తర్వాత సినిమాలతో సైతం రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.