
ఆ రెండు సిక్వెల్స్ పై ఎన్టీఆర్ మౌనం .. కారణం అదేనా..?
అయితే మొన్నటి వరకు ఎన్టీఆర్ దగ్గర చర్చ లో ఉన్న సీక్వెల్ ఒకటి మాత్రమే .. అదే కేవలం దేవర 2 .. కానీ ఇప్పుడు మరో సీక్వెల్ కూడా ఈ చర్చ లోకి వచ్చింది .. అదే జనతా గ్యారేజ్ 2 .. ఆశ్చర్యంగా ఉన్న ఈ రెండు సినిమా లు కొరటాల శివా నే తెర్కెక్కించడం ఇక్కడ మరో విశేషం .. అయితే నిజాని కి జనతా గ్యారేజ్ సిక్వెల్ ప్రతిపాదన ఎక్కడా లేదు .. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ సినిమా కు సిక్వల్ రావాలని ఎంత గానో ఆశపడుతున్నారు .. ఎందుకంటే అది ఎలాంటి ఓపెన్ ఎండింగ్ లేని మూవీ ..
ఇక ఇప్పుడు ఈ చర్చ మరోసారి మొదలవ్వటాని కి కారణం మోహన్‌లాల్ .. మోహన్ లాల్ కు టాలీవుడ్ లో మరోసారి గుర్తింపు తెచ్చిన చిత్రం జనతా గ్యారేజ్ .. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా తర్వాతే మోహన్ లాల్ కు తెలుగు లో మరింత క్రేజ్ వచ్చింది . అలాంటి సినిమా కు సీక్వెల్ చేస్తే నటించడాని కి రెడీ అని ఆయన ప్రకటించడం ఎప్పుడు మరింత ఆసక్తి గా మారింది .
స్వయంగా మోహన్‌లాల్ దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్ రావడం తో .. జనతా గ్యారేజ్ సినిమా కు సీక్వెల్ తీయాలంటూ ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేయడం ఇప్పుడు మరింత ఎక్కువయింది .. ఇప్పటి కే ఎన్టీఆర్ చేతి లో దేవర 2 ఉంది .. దీని పైన ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు .. ఇప్పుడు ఇంతలోనే జనతా గ్యారేజ్ 2 కావాలంటూ విన్నపాలు డిమాండ్స్ బాగా పెరుగుతున్నాయి .. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ పై ఎన్టీఆర్ ఏవిధంగా రియాట్ అవుతాడో .. ఎప్పుడు రియాట్ అవుతాడో చూడాలి ..