
రామ్ చరణ్ ఖాతాలో మరో గోల్డెన్ రోల్ పడబోతుందా ..!
తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి నట వారసుడి గా రామ్ చరణ్ తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన కొన్ని సంవత్సరాల్లోనే భారీ ఫేమ్ ని క్రెజ్‌ను అందుకున్నాడు స్టార్ హీరో .. ఇలా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన నటుడిగా కూడా కేవలం కొన్ని సినిమాల్లోనే చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు .. తన రెండో సినిమా మగధీరా లోనే ఎంతో పరిణీతి చూపించిన చరణ్ అక్కడి నుంచి రంగస్థలం లో చిట్టిబాబుగా ఒక లైఫ్ టైం రోల్ చేసి అభిమానులకు భారీ గిఫ్ట్ ఇచ్చాడు ..
దానికి నేషనల్ అవార్డు కూడా వస్తుందని చాలా మంది అనుకున్నారు .. కానీ అది అభిమానులకు నెరవేరలేదు .. ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమాలో కూడా అప్పన్న పాత్ర లో చరణ్ మరోసారి అందరి కీ తన నటన తో షాక్ ఇచ్చాడు .. చిట్టిబాబు ని మించిన నటుడు తన లో ఉన్నాడని అప్పన్న గా నటించి మరో అద్భుతం చూపించాడు .. ఇక ఇప్పుడు ఈ రెండు పాత్రలు తప్ప మరో ఐకానిక్ పాత్ర తన తాజా మూవీ పెద్ది తో మరోసారి బాక్సాఫీస్ ను మడత పెట్టబోతున్నట్టు అనిపిస్తుంది .
తాజా గా వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో సాలిడ్ హైప్ ని చరణ్ అందుకోగా తన మాస్ అండ్ రగ్గుడ్ లుక్స్ తో తన పర్ఫామెన్స్ కూడా సినిమా లో అదిరిపోతుంది అని ఇప్పుడు తెలుస్తుంది .. దీంతో పెద్ది కూడా చరణ్ కేరీర్ లోనే ఒక ఐకానిక్ పాత్ర గా నిలవబోతోంది అని కూడా ఇప్పుడు నుంచే టాక్ మొదలైంది .. మరి ఆ రేంజ్ లోనే సినిమా ఉంటుందా లేదా దర్శకుడు బుచ్చిబాబు ఎలా ప్లాన్ చేస్తున్నాడు అనేది సినిమా వచ్చేవరకు వేచి చూడాలి .