లిప్ లాక్ సీన్స్ వల్ల సినిమా ఆఫర్లు వదిలేసాను.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
కెరియర్ మొదటలో బుల్లి తెరపై పలు సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అయింది .. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాలో నటించి మెప్పించింది .. సూపర్ 30, జెర్సీ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఆ తర్వాత టాలీవుడ్ లో సీతారామం , హాయ్ నాన్న , ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటించింది .. ఇక రీసెంట్ గానే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కు జంటగా నటించే అవకాశం వచ్చింది .. అనుకోని కారణాలతో ఆ ఛాన్స్ మిస్సయిందనే ప్రచారం కూడా జరుగుతుంది .
అయితే కెరియర్ మొదట్లో ముద్దు సన్నివేశాలను నటించడం చూసి ఈమె తల్లిదండ్రులు షాక్ అయ్యారట .. దాంతో ఆమె తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారట .. అలాంటి సన్నివేశాల్లో అసలు నటించకూడదని ఆమెకు కండిషన్ పెట్టారట . అయితే అప్పుడు ఆ కండిషన్ కారణంగా ఈమె ఎన్నో అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందిని ఓ ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది మృణాల్ .. ఆ తర్వాత తన తల్లిదండ్రులను ఒప్పించి సినిమాల్లో ముద్దు సన్నివేశాల్లో నటించడం మొదలుపెట్టిందట ..