ఆంధ్రప్రదేశ్‌కు 50 మంది కొత్త ఎమ్మెల్యేలు.. ముహూర్తం ఎప్పుడంటే..?

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్ కు కొత్తగా 50 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. అదేంటి.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యే ప్రాథినిత్యం వహిస్తున్నారు. మరి కొత్తగా 50 మంది ఎమ్మెల్యేలు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా.. ? ఇదే నిజం అవుతోంది. ఇప్పుడు ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు తోడు కొత్తగా మరో 50 నియోజకవర్గాలు రానున్నాయి. దీంతో ఆ 50 నియోజకవర్గాలకు కొత్త ఎమ్మెల్యేలు.. వచ్చే ఎన్నికల్లో నాటికి అసెంబ్లీలో ఉండబోతున్నారు. వాస్తవానికి 2014 అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్ర‌దేశ్‌లో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 కు పెంచాల్సి ఉంది. అలాగే తెలంగాణలో ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాలను.. 153 స్థానాలకు పెంచాల్సి ఉంది.

అయితే ఎన్డీఏ ప్రభుత్వం దాని పై దృష్టి సారించలేదు. 2026 లో జరిగే నియోజకవర్గాల పున్హ‌విభ‌జనలోనే ఈ రెండు రాష్ట్రాలలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతామని చెప్పి చేతులు దులిపేసుకుంది. ఈ క్రమంలోనే 2026 లో దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పున్హ‌విభ‌జ‌న జరగనుంది. ఈ లెక్క ప్రకారం ఇప్పుడు ఉన్న ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గలో ఒక్కో నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున.. 50 కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి.

అలాగే తెలంగాణలో ఉన్న 17 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్కో పార్లమెంటు స్థానంలో రెండు కొత్త అసెంబ్లీ నియోజకవర్గాలు రానున్నాయి. అంటే.. అక్కడ మొత్తం 34 కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పడతాయి. ఈ ప్రక్రియ 2025 ఫిబ్రవరి మార్చి నుంచి మొదలుకానుంది. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్తగా 84 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతుండడంతో.. 84 మంది కొత్త ఎమ్మెల్యేలు రానున్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకునే వారికి ఇది నిజంగా పెద్ద పండగ లాంటిదే అని చెప్పాలి. 2026 చివరి నాటికి నియోజకవర్గాల పున్హవిభ‌జ‌న‌ ప్రక్రియ దాదాపు చివరి దశకు వచ్చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: