Kalki 2898AD: ఆ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసిన ఫస్ట్ ఇండియన్ హీరో ప్రభాస్.. డార్లింగా మజాకా.!!

Pandrala Sravanthi
ఈశ్వర్ సినిమాతో తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ యాక్టింగ్ పూర్తిగా నేర్చుకోకుండానే సినిమాల్లో నటించారట. అలా ఈశ్వర్ సినిమా షూటింగ్ సమయంలో అసలు ఇండస్ట్రీలో నేను హీరోగా నిలదొక్కుకోగలుగుతానా..నాకు యాక్టింగ్ వస్తుందా..  అసలు నన్ను ఎవరైనా చూస్తారా అంటూ చాలా భయపడిపోయారట.కానీ మొదటి సినిమా సమయంలో అంత భయపడిన ఈ హీరో ప్రస్తుతం ఇండియన్ సినిమాలనే ఏలేస్తున్నారు.మన ఇండియా నుండి మొదటి పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్.ఇక ఈయన చేసిన బాహుబలి మూవీ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ.. అయితే అలాంటి ప్రభాస్ ఆ విషయంలో ఇప్పటివరకు ఇండియన్ సినీ హిస్టరీలో ఏ హీరో కూడా సాధించని రికార్డును సాధించారట. మరి ఇంతకీ డార్లింగ్ తన ఖాతాలో వేసుకున్న ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దామా.. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఖాతాలో ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరో కూడా వేసుకొని ఓ రికార్డు వేసుకున్నాడు.అదేంటంటే సినిమా ఓపెనింగ్ రోజే 100 కోట్లకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాలలో ఐదు సినిమాలు ప్రభాస్ ఖాతాలో ఉన్నాయి.అలా ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరో కూడా వరుసగా తన ఐదు సినిమాలు ఓపెనింగ్స్ రోజు 100 కోట్లు కలెక్ట్ చేయలేదు. కానీ ఈ రికార్డు మాత్రం ప్రభాస్ ఖాతాలో పడిపోయింది. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 మూవీ ఓపెనింగ్స్ 217 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ ఆ రికార్డును చెరిపేసి 223 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ ఈ మూవీ ఓపెనింగ్స్ రోజే 140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

 అలాగే ప్రభాస్ నటించిన మరో డిజాస్టర్ మూవీ సాహో కూడా మొదటి రోజు 130 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.ఇక సలార్ మూవీ 178 కోట్లు తాజాగా వచ్చిన కల్కి 2898 AD మూవీ 180 కోట్లు.. ఇలా బాహుబలి 2 నుండి మొదలు వరుసగా ప్రభాస్ చేసిన ఐదు సినిమాలు 100 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేశాడు. అయితే ఇలాంటి రికార్డును క్రియేట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ హీరో ప్రభాసే.. ఇప్పటివరకు ఏ హీరో సినిమాలు కూడా వరుసగా ఇలా 100 కోట్లు వసూలు చేయలేదు.. ఇక ఇండియన్ సినిమాల్లో ప్రభాస్ ఈ రికార్డుని ఇప్పట్లో ఎవరూ టచ్ కూడా చేయలేరు.. సినిమా నెగిటివ్, పాజిటివ్ టాక్ తో సంబంధం లేకుండా ఎంతో మంది అభిమానులు ప్రభాస్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకొని సినిమా చూస్తూ ఉంటారు. అలా కొంతమంది సినిమా ప్లాప్ అయినా కూడా పట్టించుకోరు.కేవలం ప్రభాస్ యాక్టింగ్ ని చూడడం కోసమే థియేటర్లకు వెళ్తారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: