కల్కి 2898 AD: ప్రభాస్ ఆ మూవీలో చేసిన పాత్రనే కల్కి లో నాగ్ అశ్విన్ కాపీ కొట్టాడా.?

Pandrala Sravanthi
కల్కి.. కల్కి.. కల్కి.. దేశవ్యాప్తంగా ఏ థియేటర్లో చూసినా కూడా కల్కి హవానే నడుస్తుంది.. ఈ సినిమా చూసిన జనాలు రకరకాలుగా రివ్యూలు ఇస్తూ సినిమా బ్లాక్ బస్టర్..అంటూ ప్రభాస్ అభిమానులు ఓ రేంజ్ లో సంబరపడిపోతున్నారు.. ఇక గత కొద్దిరోజులుగా ప్రభాస్ అభిమానులకు ఆయన సినిమాలు నిరాశ కలిగిస్తున్నాయి. ఇక ఆ మధ్యకాలంలో సలార్ వచ్చినా కూడా అంతగా అభిమానులను అలరించలేకపోయింది.ఇక అలాంటి ఆకలితో ఉన్న ప్రభాస్ అభిమానులకు ఫుల్ మీల్స్ ల కల్కి 2898AD మూవీ వచ్చేసరికి ఈ సినిమాను చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అయితే ప్రభాస్ కల్కి 2898 AD మూవీలో బైరవా అనే పాత్రలో నటించారు. అయితే ఈయన డబ్బులు తీసుకొని కాంప్లెక్స్ వాళ్ళకి మనుషులను అప్పజెపుతూ ఉంటారు. అయితే ఇలా పనిచేస్తూ డబ్బులు సంపాదిస్తున్న ప్రభాస్ బౌంటీ హంటర్ పాత్రలో నటించారు. 

ఇక ఇంగ్లీష్ పదం అయినా బౌంటీ హంటర్ ని తెలుగులో డబ్బులు తీసుకుని వాళ్ళు వెతికే వారిని అప్పజెప్పడం అనే మీనింగ్ వస్తుంది. అయితే కల్కి 2898 AD మూవీలో భైరవా పాత్రలో బౌంటీ హంటర్ గా చేసిన ప్రభాస్ అంతకుముందే మరో సినిమాలో కూడా చేశారు. ఇక ఆ సినిమాని కల్కి సినిమాని మ్యాచ్ చేస్తూ కొంత మంది ట్రోలర్స్ నాగ్ అశ్విన్ పై ట్రోల్స్ చేస్తున్నారు.ప్రభాస్ ఆ సినిమాలో చేసిన పాత్ర నే మళ్లీ కల్కి మూవీలో కూడా కాపీ చేశారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.మరి ఇంతకీ ప్రభాస్ కల్కి మూవీలో బౌంటీ హంటర్ గా చేసిన పాత్రని అంతకుముందే చేసిన ఆ సినిమా ఏంటా అని ఆలోచిస్తున్నారా..ఆ సినిమా ఏంటో కాదు.. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఏక్ నిరంజన్ మూవీ..

ఈ సినిమాలో కూడా ప్రభాస్ డబ్బులు తీసుకుని పోలీసులకి  వాళ్లు వెతికే నేరస్థులను పట్టుకొని వారికి అప్పజెప్పుతాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెప్తాడు.అదేంటంటే సోనూ సూద్ ప్రభాస్ ని నువ్వు అసలు ఏం పని చేస్తావు అని అడిగితే.. తెలుగులో దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఇంగ్లీష్ లో మాత్రం దీన్ని బౌంటీ హంటర్ అంటారు అంటే పోలీసులు వెతికే నేరస్తులను పట్టుకొని వాళ్లకి అప్పజెప్పి డబ్బులు తీసుకోవడం అంటూ చెబుతారు. అలా ఏక్ నిరంజన్ లో చేసిన బౌంటీ హంటర్ పాత్రని మళ్ళీ నాగ్ అశ్విన్ కల్కి 2898 AD మూవీలో ప్రభాస్ చేత చేయించారు. అలా ఆ సినిమాకి ఈ సినిమాను మ్యాచ్ చేస్తూ నాగ్ అశ్విన్  ఏక్ నిరంజన్ మూవీ లో ప్రభాస్ పాత్రను కాపీ కొట్టి మళ్ళీ ఆయనతోనే చేయించారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: