ఏపీ: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.. చిన్నమ్మ ఆపేనా..?

Divya
గత కొన్నేళ్ల నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణం చేయకూడదంటు ఎంతో మంది నేతలు సైతం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షరాలు అయిన పురందేశ్వరి ఈ విషయం పైన పోరాడుతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ఎంపీగా పురందేశ్వరి వ్యవహరిస్తోంది. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయకుండా ఉండేందుకు ఆలోచించాలంటు ఆమె కేంద్రానికి కోరుతున్నారు. లాభాల బాటలో నడిపించేందుకే సహకరించాలంటూ కూడా కేంద్రానికి ఉక్కు మంత్రిశాఖ కుమారస్వామికి తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేయడం జరిగింది.

అందుకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడమే మంచిది అంటూ కూడా తెలియజేస్తున్నారు. మరి పెట్టుబడులు ఉపసంహరణ విషయానికి కూడా కేంద్రం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని.. పురందేశ్వరి ఇచ్చినటువంటి ప్రతిపాదన సైతం అంగీకరిస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ఒకవైపు బిజెపి కేంద్రం ఒకరకంగా ఆలోచిస్తూ ఉంటే రాష్ట్ర వర్గం మాత్రం మరొకరకంగా ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికుల సైతం మొదటి నుంచి వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు మూడు సంవత్సరాలకు పైగా ఆందోళన చేస్తూ ఉన్నారు.

చాలా పార్టీల సైతం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్రం మాత్రం ఎక్కడ తగ్గేలా కనిపించడం లేదు ఎందుకంటే.. పెట్టుబడులు ఉపసంహరణ విషయం కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్ కు మాత్రమే కాకుండా మిగతా కేంద్ర ప్రభుత్వ రంగాల సంస్థలకు కూడా సంబంధించినదట.. అయితే కార్మికుల సంఘాల నుంచి ఎన్నో వ్యతిరేకత్తులు వస్తున్న రాజకీయ పార్టీలు సపోర్టు కూడా లేకపోవడంతో ముందుకు వెళ్లడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్రానికి సంబంధించి బిజెపి ముఖ్య నేతలు సైతం ఇంతకుముందు ప్రధానితో చాలా సందర్భాలలో ఈ విషయాన్ని ప్రస్తావించిన పెద్దగా స్పందించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని పురందేశ్వరి ఆపగలదా లేదా అనే విషయం చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: