రామోజీరావు సంస్మరణ సభకు పవన్ కళ్యాణ్ మిస్సింగ్..!!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఎన్నో రకాల నిర్ణయాలను తీసుకుంటోంది. ముఖ్యంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని వెంటబెట్టుకొని మరి ఉంటారు. అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం ప్రముఖ నిర్మాత, వార్తాపత్రిక అధినేత, రామోజీ ఫిలిం సిటీ అధినేత రామోజీ రావు అనారోగ్య సమస్యల వల్ల మృతి చెందారు. ఈయన మృతికి ఎంతోమంది సినీ సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కాకుండా వ్యాపారవేత్తలు కూడా సంతాపం తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రామోజీరావు సంస్కరణ సభను కూడా అధికారికంగా నిర్వహించబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

అయితే ఇందుకోసం విజయవాడ సమీపంలోని కానూరులో ఒక భారీ ఏర్పాటు సభను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే ఈ సంస్కరణ సభకు సంబంధించిన పలు విషయాలను సమాచార శాఖ పత్రికలకు సైతం యాడ్స్ కూడా ఇచ్చారు. అయితే ఈ యాడ్స్ లో కేవలం చంద్రబాబు నాయుడు పేరు ఫోటో మాత్రమే కనిపించింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరు కానీ డిప్యూటీ సీఎం ఫోటో లేకపోవడం ఇక్కడ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్లో టిడిపి పార్టీ నిలబడడానికి ముఖ్య కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ కు కూటమిలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. అందుకే డిప్యూటీ సీఎం తో పాటు తన పార్టీలో ఉండే ముఖ్య నేతలకు కూడా పదవులు ఇచ్చారు. అంతేకాకుండా ఎలాంటి విషయాలలోనైనా సరే తనతో సమానంగానే పవన్ కళ్యాణ్ ఉంటారంటూ చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు జైలు లో ఉన్న సమయంలో జైలు కెళ్ళి మరి బయట పొత్తు పెట్టుకుంటాం అంటూ పవన్ కళ్యాణ్ చెప్పడంతో చాలామంది నేతలు కార్యకర్తలు కూడా విసిగిపోయారు.. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ వాటన్నిటిని దిగమింగుకొని మరి వాటన్నిటిని భరించి కూటమితో పొత్తు పెట్టుకుని టిడిపి జనసేన బిజెపి పార్టీలు మూకుమ్మడిగా పోటీపడి విజయాన్ని అందుకున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఈ సంస్కరణ సభకు పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: