పెద్దిరెడ్డికి మొదటి దెబ్బ: పుంగనూరులో టీడీపీ పగా ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. మొన్న  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. జగన్మోహన్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైనా సంగతి తెలిసిందే. 175 సీట్లకు 175 సీట్లు వస్తాయనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లడం జరిగింది. అయితే అక్కడ ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం కూటమికి 164 స్థానాలు వస్తే... వైసీపీ పార్టీకి కేవలం 11 స్థానాలు వచ్చాయి.  అంతేకాకుండా... ఏపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ప్రశ్నార్థకంగా మారింది.  అయితే ఇలాంటి నేపథ్యంలో... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి కూడా ఊపించని ఎదురు దెబ్బ తగిలింది. 

పుంగనూరులో... మున్సిపాలిటీ పీఠాన్ని  దక్కించుకునే దిశగా అడుగులు వేస్తోంది తెలుగుదేశం పార్టీ. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి భారీ షాక్ తగిలింది. వైసిపి గుడ్ బై చెప్పారు ఛైర్మన్‌ అలీం భాషా సహా 12 మందిపైగా కౌన్సిలర్లు. అంతేకాదు... పుంగనూరు టీడీపీ ఇన్‌ ఛార్జ్‌ చల్లా బాబు సమక్షంలో వైసిపి పార్టీకి రాజీనామా చేసి టిడిపిలో చేరారు కౌన్సిలర్లు. పుంగనూరు మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టిన టిడిపి నేత చల్లా బాబు....కౌన్సిలర్లను లాగేసుకున్నారు.

ఇక ఈ సందర్భంగా  పుంగనూరు టిడిపి ఇన్ చార్జ్ చల్లా బాబు మాట్లాడుతూ... ఇక ఆటలు సాగావు... తండ్రి, కొడుకులు ఎంత మోసకారులో ప్రజలకు తెలిసింది..పుంగనూరు కుటుంబ పరిపాలనా సాగిస్తూ వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహించారు.  పుంగనూరు ఒకలా ఢిల్లీలో ఒకలా మాట్లాడటం పెద్దిరెడ్డి కుటుంబానికే చెల్లింది...ఎన్నికల ముందు మైనారిటీలు బిజెపి ఓట్లు వేయద్దాని తండ్రి, కొడుకులు ప్రచారం చేసి పదిరోజుల్లోనే బిజెపికి మద్దతు ఇచ్చారని తెలిపారు.

అబద్ధాలు చెప్పి పుంగనూరు ప్రజలను, మున్సిపల్ చైర్మన్ సహా కౌన్సిలర్లును మోసం చేశారు...మీ అక్రమాలు అన్ని ప్రజల బయట పెట్టే సమయం వచ్చిందని హెచ్చరించారు. మీ వైఖరి నచ్చేక కౌన్సిలర్లు అందరూ రాజీనామా చేసి టిడిపిలో చేరారని మండిపడ్డారు. పెద్దిరెడ్డి ఇలాకాలో పదవి మాత్రమే ఉంటుంది.. అధికారం ఉండదు..పెద్దిరెడ్డి కుటుంబం ఎన్నో అక్రమాలు పుంగనూరులో చేసిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: