లోకేష్ చాలా బిజీబిజీ.. ఏదో జ‌రుగుతోందా..?

RAMAKRISHNA S.S.
టీడీపీ యువ‌నాయ‌కుడు, మంత్రి నారా లోకేష్ బిజీబిజీగా ఉన్నారు. అయితే.. ఆయ‌న ప్ర‌స్తుతం ఉన్న అధికారుల‌తోనూ.. మంత్రుల‌తోనూ భేటీ అయి.. ప‌లు అంశాల‌పై చ‌ర్చిస్తే.. విష‌యం వేరేగా ఉండేది. కానీ, ఈ విష‌యంలో ఇప్పుడు చ‌ర్చ ఏంటంటే.. గ‌తంలో నారా లోకేష్‌పై కేసులు పెట్టిన అధికారులు.. పెట్టించి న అధికారులు వ‌చ్చి ఆయ‌న‌తో భేటీ కావ‌డం. ఆయ‌న కూడా.. గంట‌ల కొద్దీ స‌మ‌యం వారితో చ‌ర్చించ డం వంటివి ఆస‌క్తిగా మారాయి.

వైసీపీ హ‌యాంలో నారా లోకేష్‌పై ఫైబ‌ర్ గ్రిడ్ కార్య‌క్ర‌మంలో అవినీతి చోటు చేసుకుంద‌ని పేర్కొంటూ.. ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. అయితే.. ఇలా కేసులు న‌మోదు కావ‌డం.. ఫైబ‌ర్ గ్రిడ్‌కు సంబంధిం చి గ‌త చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల‌ను వెల్ల‌డి చేయ‌డంలోకొంద‌రు కీల‌క అధికారులు వైసీపీ స‌ర్కారుకు స‌హ‌క‌రించార‌నే విష‌యం అప్ప‌ట్లో చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. కోర్టుల‌కు వెళ్లి ఈ వ్య‌వ‌హారం నుంచి కొంత ఉప‌శ‌మ‌నం అయితే పొందారు.

ఇంత‌లో ప్ర‌భుత్వం మారింది. అయితే.. వాస్త‌వానికి.. గ‌త ప్ర‌భుత్వంలో ఉండి.. టీడీపీ నేత‌ల‌పై కేసులు పెట్ట‌డంలోనూ.. వారిని ఆయా కేసుల్లో ఇరికించ‌డంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌ను ప్ర‌స్తుత ప్ర‌భుత్వం దూరం పెట్టింది. దీంతో అనేక మంది అధికారులు ప‌క్క‌కు త‌ప్పుకొన్నారు. వీరిలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జ‌వ‌హ‌ర్‌రెడ్డి కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు ఫైబ‌ర్ గ్రిడ్ కేసు విష‌యంలో నారా లోకేష్‌ను ఇరికించేలా వ్య‌వ‌హ‌రించిన అధికారుల‌ను ఆయ‌న క‌ల‌వ‌డ‌మే చ‌ర్చ‌గా మారింది.

వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ అమ‌లు కాలేదు. కానీ, దీనిలో జ‌రిగిన అక్ర‌మాలు, అన్యాయాలు అంటూ కొన్నింటిని ఏక‌రువు పెట్టారు. ఈ క్ర‌మంలోనే కేసులు కూడా న‌మోదు చేశారు. దీనికిస‌హ‌క‌రించిన అధికారుల‌కు జ‌గ‌న్ స‌ర్కారు త‌ర్వాత కాలంలో మేళ్లు కూడా చేసింద‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇలాంటి అధికారుల‌తో నారా లోకేష్ సుదీర్ఘంగా భేటీ కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. మ‌రి దీని వెనుక ఉన్న రీజ‌నేంటి?  ఎందుకు ఇలా చేస్తున్నార‌నేది ఆస‌క్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: