పేదలకు శుభవార్త.. చంద్రన్న బీమా 10 లక్షలు.. వివరాలు ఇవే..!

Pulgam Srinivas
ఎవరికైనా బీమా అనేది కచ్చితంగా ఉండాలి. ఏదైనా ప్రమాదవశాత్తు , ప్రకృతి వైపరిత్యాలవల్ల ఒక వ్యక్తి అనుకోకుండా చనిపోయినట్లు అయితే అతనిపై ఆధారపడిన వారు రోడ్డుపై పడే ప్రమాదం ఉంటుంది . అందువల్ల మంచి నాలెడ్జ్ ఉన్నవారు , డబ్బు ఉన్నవారు జీవిత బీమా చేసుకుంటూ ఉంటారు . అలా చేసుకున్న సమయంలో వారికి అనుకోకుండా మరణం సంభవించినట్లు అయితే వారి కుటుంబానికి చేసుకున్న బీమా మొత్తం డబ్బు వెళుతుంది . దానితో వారిని నమ్ముకున్న వ్యక్తులు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు పడరు.

ఇక ఇలా డబ్బు ఉన్న వారి కోసమే మాత్రమే కాకుండా కేంద్ర , ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు కూడా ఇలాంటి బీమా పథకాలను ఇస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా పేరుతో 3 లక్షల రూపాయలు మరణించిన వారికి ఇచ్చే పథకం ఉంది. దానిని జగన్ వచ్చిన తర్వాత జగనన్న బీమా పేరుతో ఐదు లక్షలకు పెంచారు. ఇక తాజాగా మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రన్న బీమా పేరుతో ఐదు లక్షల మొత్తాన్ని 10 లక్షలకు పెంచారు. ఇందుకు సంబంధించిన అనేక వివరాలను కూడా తెలుగు దేశం పార్టీ తాజాగా విడుదల చేసింది.

తెలుగుదేశం పార్టీ చంద్రన్న భీమా పథకాన్ని 3 లక్షల నుండి పది లక్షలకు పెంచాము. గత ప్రభుత్వం జగనన్న భీమా అనే పేరును మార్చింది కానీ బీమా డబ్బులను మాత్రం సరిగా ఇవ్వకుండా కాలయాపన చేసింది. గత ప్రభుత్వంలో బీమా డబ్బులు పొందని వారందరికీ వాటిని క్లియర్ చేయడం మాత్రమే కాకుండా ఇకపై ఏ విధంగా మరణించినా కూడా వారికి చాలా స్పీడ్ గా డబ్బులను వారికి కుటుంబాలకు ఇస్తాం అని తెలుగు దేశం పార్టీ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: