సీఎంకు డిప్యూటీ స‌ల‌హా... ప‌వ‌న్ స‌ల‌హా పాటించిన చంద్ర‌బాబు.. ఏం జ‌రిగింది...!

RAMAKRISHNA S.S.
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన అనేక ప‌థ‌కాలు ఉన్నాయి. జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌, నాడు-నేడు, జ‌గ‌నన్న విదేశీ విద్యాదీవెన‌, వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం, వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, వైఎస్ ఆర్‌ కల్యాణమస్తు పథకం, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం, జ‌గ‌న‌న్న ఆస‌రా.. ఇలా అనేక ప‌థ‌కాలు  ఉన్నాయి. వీటిలో కామ‌న్‌గా వైఎస్సార్‌, లేదా.. జ‌గ‌న్ పేరు ఉంది. దీంతో ఇప్పుడు వ‌చ్చిన కూట‌మి స‌ర్కారు ఈ ప‌థ‌కాల పేర్ల‌ను మార్చేసింది.  

సాధార‌ణంగా ప్ర‌భుత్వం మారితే.. సామాజిక ప‌థ‌కాల పేర్లు మార‌డం కామ‌నే. ఇప్పుడు ఏపీలోనూ అదే జ‌రిగింది. అయితే.. గ‌తంలో నూ చంద్ర‌బాబు 2014-19 మ‌ధ్య అప్ప‌టి వ‌ర‌కు ఉన్న కొన్ని సంక్షేమ ప‌థ‌కాల‌ పేర్ల‌ను మార్పు చేశారు. వీటిలో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పేరును ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీగా మార్పు చేశారు. ఇందిరా సాగ‌ర్ ప్రాజెక్టు పేరును పోల‌వ‌రం ప్రాజెక్టుగా మార్చారు. అదేవిధంగా ఇందిర‌మ్మ‌ ఇంటి స‌ముదాయా ల‌కు `టిడ్కో ఇళ్లు`గా పేరు పెట్టారు. కొన్నింటికి త‌న పేరు, ఎన్టీఆర్ పేరును కూడా పెట్టారు.

కానీ, ఇప్పుడు మాత్రం జ‌గ‌న‌న్న పేరు తీసేసినా కూడా.. ఎక్క‌డా కూడా త‌న పేరు(ఒకే ఒక్క ప‌థ‌కానికి త‌ప్ప‌) ఎన్టీఆర్ పేరును మాత్రం పెట్టుకోలేదు. అంటే గ‌తానికి భిన్నంగా వాటికి పేర్లు మార్చారు. ఉదాహ‌ర‌ణ‌కు జ‌గ‌న‌న్న విదేశీ విద్యాదీవెన ప‌థ‌కానికి.. అంబేడ్క‌ర్ ఓవ‌ర్సీస్ విద్యా నిధిగా మార్చారు. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ.. కేవ‌లం ఆరోగ్య శ్రీగా, జ‌గ‌న‌న్న సివిల్ స‌ర్వీసెస్ స్కీంను కేవ‌లం సివిల్ స‌ర్వీసెస్ ప్రోత్స‌హాక ప‌థ‌కంగా మార్పు చేశారు.

ఎక్క‌డా కూడా.. టీడీపీ నాయ‌కుల పేర్లు పెట్ట‌లేదు. పైగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అనేపేరును చేర్చారు. అయితే.. ఇలా చేయ‌డం వెనుక‌.. జ‌న‌సేన అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌సూచ‌న‌లు ఉన్నాయ‌ని తెలుస్తోం ది. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు.. వ్య‌క్తుల పేర్లు పెట్ట‌డాన్ని ముఖ్యంగా నేటి త‌రం నాయ‌కుల పేర్లు పెట్ట‌డాన్ని ప‌వ‌న్ వ్య‌తిరేకిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సూచ‌న‌ల‌ను చంద్ర‌బాబు పాటించార‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం మారిన పేర్ల‌లో చంద్ర‌బాబు పేరుకు కేవ‌లం చంద్ర‌న్న పెళ్లికానుక‌కు మాత్ర‌మే ఉంచి.. మిగిలిన వాటిని అలానే వ‌దిలేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: