కల్కి 2829AD: ప్రభాస్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసిన శ్యామలాదేవి..

Divya
ప్రభాస్ తో సహా ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోలు సైతం నటించిన తాజా చిత్రం కల్కి.. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా హవానా ఎక్కువగా కనిపిస్తోంది. సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అటు థియేటర్స్ దగ్గర కూడా అభిమానులు చాలా కోలాహాలం చేస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయల బడ్జెట్తో తెరకెక్కించిన కల్కి చిత్రం ఈ రోజున భారీగా ఓపెనింగ్స్ సాధించింది.. ఫస్ట్ షో చూసిన చాలామంది ప్రేక్షకులు కూడా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అంటూ తెలియజేస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రభాస్ యాక్షన్ సన్నివేశాలు కూడా హైలెట్ గా ఉంటున్నాయని ఆడియన్స్ , అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు కూడా కల్కి సినిమాని ప్రశంసలతో ముంచెత్తారు . ఇప్పటికే పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందంతో పాటు చిరంజీవి వంటి వారు కూడా స్పందించారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ కూడా ఈ సినిమాను చూసి స్పందించడం జరిగింది.. ప్రభాస్ పెద్దమ్మ స్వర్గీయ నటుడు కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఈమె హైదరాబాదులోని ప్రసాద్ ఐమాక్స్లో సినిమాని చూడడం జరిగింది.. అయితే ఊహించిన బుజ్జికారులు ఆమె కూర్చునే ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అలాగే ఆమె మాట్లాడుతూ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది ఒక పండుగ లాంటి వార్త 1000 పెద్ద పండుగలను కలిపితే కల్కి పండుగ అంటూ తెలియజేసింది. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి ముఖ్య కారణం అభిమానులే అంటూ తెలిపారు. వెయ్యి రెబల్ స్టార్స్ కలిపితే మా బాబు ప్రభాస్ అంటూ ఎమోషనల్ గా మాట్లాడడం జరిగింది శ్యామలాదేవి.. కల్కి సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వడంతో అభిమానులు సైతం తెగ సంబరాలు చేసుకుంటున్నారు.ఇప్పటికి ప్రభాస్ మీద ఉన్న రికార్డ్స్ ను సైతం తిరగరాస్తుందంటూ తెలుపుతున్నారు. ఈ చిత్రంలో నటించిన నటినటులు అందరూ కూడా అద్భుతంగా నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: