హరీష్ రావు పార్టీ మారతారా.. ఆయన ఏమన్నాడంటే?

praveen
2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అటు ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీగా కొనసాగిన బిఆర్ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఈ క్రమంలోనే ఇక బిఆర్ఎస్ పార్టీ ఇక కొన్ని దఫాలుగా అటు రాష్ట్రంలో అధికారాన్ని కొనసాగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేశారు. అందుకు తగ్గట్లుగానే వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది ఆ పార్టీ. కానీ మూడోసారి మాత్రం ఆ పార్టీకి భంగపాటు  తప్పలేదు  ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు నిలవడంతో ఇక బిఆర్ఎస్ ప్రతిపక్ష హోదా తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మొన్నటికి మొన్న జరిగిన  పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది   ఎందుకంటే తిరుగులేని పార్టీక ప్రస్థానం కొనసాగించిన కారు పార్టీకి ఒక్కటంటే ఒక్క లోక్సభ స్థానంలో కూడా విజయం సాధించలేకపోయింది. దీంతో గులాబీ పార్టీ పని అయిపోయిందని ఇక ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లందరూ కూడా మరో పార్టీలోకి వెళ్ళబోతున్నారు అంటూ అందరూ చర్చించుకున్నారు. ఈ క్రమంలోనే కారు పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న హరీష్ రావు సైతం మరో పార్టీలోకి వెళ్ళబోతున్నారంటూ ప్రచారం ఊపు అందుకుంది.

 ఈ క్రమంలోనే హరీష్ రావు లాంటి కీలక నేత పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్వయంగా మాజీ మంత్రి హరీష్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు అంటూ చెప్పుకొచ్చారు హరీష్ రావు. సోషల్ మీడియాతో పాటు పలు చానళ్లు బ్రేకింగ్ స్క్రోలింగ్స్ చేస్తూ వ్యూస్ కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు  ఇకపై తన విషయంలో తప్పుడు ప్రచారం చేయడం మానాలి అంటూ హితవు పలికారు హరీష్ రావు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: