ప్చ్.. ఆ అనుభవశాలిలను మంత్రులని చెయ్యకుండా టీడీపీ తప్పు చేసిందిగా?

FARMANULLA SHAIK
•పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన సీనియర్లు
•సీనియర్ నేతలకు అన్యాయం చేసిన బాబు
•అపర మేధావులని పక్కన పెట్టి తప్పు చేసిన టీడీపీ
 
(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ): కొత్త మంత్రి వర్గంలో ఉత్తరాంధ్రా సీనియర్ నేతలకు సీఎం చంద్రబాబు నాయుడు నిజంగా గట్టి షాక్ ఇచ్చారు. పార్టీకి సుదీర్ఘకాలం సేవలు అందించిన ఈ దమ్మున్న రాజకీయ నేతలని పక్కన పెట్టారు.ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఒక్కరినే మంత్రి పదవికి ఎంపిక చేయడంపై సీనియర్ నేతలు బాధ పడుతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులు పై చంద్రబాబు నాయుడుకు ఉన్న గౌరవం ఇదేనా అంటూ తమ అనుచరులు వద్ద వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మంత్రివర్గ కూర్పుపై ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేతలు పైకి సాధారణంగా ఉన్నా కానీ లోపల మాత్రం చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.. తాజా మంత్రివర్గ జాబితాలో తమ పేర్లు లేకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రులు అయ్యన్న, గంటా శ్రీనివాసరావు ఇంకా బండారు సత్యనారాయణమూర్తి వంటి సీనియర్ నేతలకి మంత్రి పదవులని ఆశించారు టీడీపీ తమ్ముళ్లు.అయ్యన్నపాత్రుడు ఒకసారి ఎంపీగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా మూడుసార్లు మంత్రిగా పనిచేశారు..
గంటా ఒకసారి ఎంపీ 5 సార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఇంకా రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మరో సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.. గతంలో మంత్రిగా కూడా పనిచేశారు..అలాగే వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.. ఈసారి మంత్రివర్గ జాబితాలో తమకు చోటు లభిస్తుందని చాలా నమ్మకంతో ఉన్నారు..కానీ వీరందరి ఆశలపైన చంద్రబాబు నీళ్లు జల్లారు.. పాపం అయ్యన్న  ఇంటి దగ్గర టిడిపి కార్యకర్తలు కాబోయే మంత్రి అయ్యన్నపాత్రుడు కి శుభాకాంక్షలు అంటూ ఫ్లెక్సీలు కూడా వేశారు..పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ తరపున వాయిస్ వినిపించింది అయ్యన్న పాత్రుడని ఆయన అనుచరులు బాధ పడుతున్నారు.. పార్టీలో సీనియర్ నేత అయిన అయ్యన్నకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ అయ్యన్న అనుచరులు ప్రశ్నిస్తున్నారు. ఇక బండారు సత్యనారాయణమూర్తి అయితే పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలను జనసేనకు త్యాగం చేశారని గుర్తు చేస్తున్నారు.పార్టీ కోసం ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు చేసిన ఈ సీనియర్ నేతలు చంద్రబాబుకు ఎందుకు గుర్తు రాలేదని వారితో పాటు వారి అనుచరులు కూడా బాధ పడుతున్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పక్కన పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: