కొడుకు ఫ్యూచర్‌ కోసం...తన కెరీర్‌ నాశనం చేసుకుంటున్నారా?

Veldandi Saikiran
2024 అసెంబ్లీ ఎన్నికల్లో... వైసిపి పార్టీకి చెందిన కీలక నేతలందరూ ఓడిపోయారు. మంత్రులు, మాజీ మంత్రులు అనే తేడా లేకుండా... కూటమి చేతిలో చాలామంది వైసిపి కీలక నేతలు ఓటమి పాలయ్యారు. అయితే కూటమి దెబ్బకు... కుదేలైనా వారిలో కరణం బలరామకృష్ణమూర్తి కుటుంబం కూడా ఉంది. ఈసారి టిడిపి చేతిలో కరణం బలరాం కొడుకు కరణం వెంకటేష్ దారుణంగా ఓడిపోయారు.

ప్రకాశం జిల్లాలో కీలక నేతగా ఉన్న  కరణం బలరాం... కాంగ్రెస్ పార్టీతోనే తన రాజకీయ అరంగేట్రం చేశారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కరణం బలరాం.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఎమ్మెల్యేగా ఇప్పటికే నాలుగు సార్లు విజయం సాధించిన కరణం బలరాం.. ఒకసారి ఎంపీగా కూడా విజయం సాధించారు. అయితే ఇంతటి ప్రజా ఆదరణ ఉన్న కరణం... కరణం వెంకటేష్ భవిష్యత్తు కోసం చాలా ఆరాటపడుతున్నారు.

తన కొడుకు రెండుసార్లు  ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో... అతని భవిష్యత్తు కోసం...  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కరణం బలరాం. 2014 ఎన్నికల్లో అద్దంకి నుంచి...  తన కుమారుడు కరణం వెంకటేష్ రంగంలోకి దిగాడు.  అయితే అప్పుడు.. గొట్టిపాటి రవికుమార్ చేతిలో ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల కరణం వెంకటేష్ పోటీ చేయలేదు. కానీ కరణం బలరాం.. 2019 సంవత్సరంలో చీరాల నియోజకవర్గం నుంచి  తెలుగుదేశం పార్టీ తరఫున గెలుపొందారు.
ఆ తర్వాత వైసిపి పార్టీలో చేరింది కరణం బలరాం కుటుంబం. ఈ నేపథ్యంలోనే చీరాల  నియోజకవర్గాన్ని కరణం వెంకటేష్ కు అప్పగించారు.

దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల బరిలో ఉన్నారు వెంకటేష్. అయితే ఇక్కడ త్రిముఖ పోరు ఉన్న నేపథ్యంలో... టిడిపి అభ్యర్థి ఇక్కడ విజయం సాధించారు. ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్, టిడిపి అభ్యర్థి మాలకొండయ్య  మధ్య తీవ్ర పోటీ నేపథ్యంలో... అక్కడ టిడిపి బయట పడింది. దీంతో కరణం  కుమారుడు వెంకటేష్ మరోసారి ఓడిపోయారు.  దీంతో... మంత్రి కావాలన్న తన రాజకీయ  ఆశయం, ఇటు తన కొడుకు ఎమ్మెల్యేగా విజయం సాధించడం ఏది జరగకపోవడంతో... కరణం బలరాం చాలా బాధపడుతున్నారట. వచ్చే ఎన్నికల్లో అయినా... తన కొడుకుని గెలిపించుకునేందుకు సిద్ధమవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: