చంద్ర బాబు: రైతు భరోసా కోసం ప్రజలు ఎదురుచూపు..!

Divya
పీఎం కిసాన్ 17వ విడత మోడీ సర్కార్ వచ్చే మంగళవారం విడుదల చేయబోతున్నారు. పిఎం కిసాన్ కింద ప్రతి ఏడాది మూడు విడుదల 6000 చొప్పున మోడీ ప్రభుత్వం అందిస్తున్నది. మూడోసారి ప్రధానిగా మోడీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం చేశారు.. అయితే ఈ సీజన్లో ఏపీ మొత్తం 43.52 లక్షల మంది రైతులకు 870 కోట్ల రూపాయల సైతం విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ కూడా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే..ఎన్నికలకు ముందే రైతు భరోసా కింద ప్రతి రైతుకు 20 వేల చొప్పున ఏడాదికి అందిస్తామంటూ సూపర్ సిక్స్ హామీలలో తెలిపారు.

దీంతో ప్రజలు కూడా వీటికి బాగా ఆకర్షించారు.కూటమి ప్రభుత్వం కొలువు తీరింది చంద్రబాబు ఇప్పటికే ఐదు సంతకాలు కూడా చేశారు. ఇందులో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటివి చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మెగా డీఎస్సీ పైన మొదటి సంతకం నిరుద్యోగులకు అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్టర్ రద్దు ఫైలు సంతకం పైన రెండవ సంతకం చేయగా రైతుల్ని ఆనందించినట్లు టిడిపి భావిస్తోంది కానీ ఇంతవరకు బాగానే ఉన్న పీఎం కిసాన్ నిధులు రైతుల ఖాతాలో జమ చేస్తూ ఉండడంతో చంద్రబాబు సర్కార్ అందించే సహాయం పైన ఇప్పుడు చర్చ జరుగుతున్నది.

చంద్రబాబు అందించే సహాయం కోసమే రైతులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చమ్మ నాయుడు లేదా చంద్రబాబు నాయుడు ఈ విషయం పైన ఎలాంటి ప్రకటన చేస్తారో అంటూ రైతులు చాలా ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు.. రైతు భరోసా కింద జగన్ ఏడాదికి 16 వేల రూపాయలు ఇస్తానని చెప్పినప్పటికీ చంద్రబాబు ₹20,000 ఇస్తాను అనడంతో చాలామంది టీడీపీ వైపు మొగ్గు చూపారు రైతులు. ప్రస్తుతం వర్షాలు పడుతూ ఉండడంతో పెట్టుబడి సహాయం కింద ఎంతో కొంత అవసరం పడుతుంది. చంద్రబాబు ఇస్తానన్న 20000 కోసం రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: