మంత్రి పదవి మిస్ : బండారు సత్యనారాయణమూర్తికి మంత్రి పదవి ఎలా మిస్ అయిందో తెలిస్తే...

Suma Kallamadi
* ఏపీ మంత్రి వర్గంలో ఎక్కువగా కొత్తవారే  
* మాజీ మంత్రులకు మిస్సయిన పదవులు  
* బండారు విషయంలో చంద్రబాబు సరైన నిర్ణయం  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో చాలా మంది మాజీ మంత్రులకు ఈసారి చోటు దక్కలేదు. అందులో ఒకరు బండారు సత్యనారాయణ మూర్తి. ఈయన పరవాడ, పెందుర్తి నియోజకవర్గల నుంచి 4 టైమ్స్ ఎమ్మెల్యేగా గెలిచారు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. ఆయనది పరవాడ మండలంలోని వెన్నెలపాలెం గ్రామం స్వస్థలం. 1994, 1999 ఎన్నికల్లో పరవాడ నియోజకవర్గంలో గెలిచారు. 2014లో పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. సత్యనారాయణ మూర్తి 2024లో మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అయినా ఈసారి ఆయనకు చంద్రబాబు మంత్రివర్గంలో చోటు లభించలేదు. మూర్తి 30 ఏళ్లుగా టీడీపీ పార్టీకి సేవలు చేస్తూ వస్తున్నారు. ‘నా కట్టే కాలేంతవరకు నేను పసుపు జెండా మోస్తూనే ఉంటా.. నా చితి మీద పసుపు జెండా వేసి కాల్చాలి’ అని బండారు ఒకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 68 ఏళ్ల వయసులోనూ పార్టీలో కొనసాగుతూ సత్తా చాటుతున్నారు. చాలా అనుభవం ఉన్న నేత. ఒకసారి మంత్రిగా చేసినా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అయినా ఈసారి ఆయనను పక్కన పెట్టేసి టైం ఎమ్మెల్యే అయినవారికి మంత్రి పదవులను ఇచ్చారు చంద్రబాబు ఈసారి క్యాబినెట్ కూర్పులో చంద్రబాబు చాణక్యం చూపించారనే చెప్పాలి.  
ఈయనకు కింజరాపు రామ్మోహన్‌ నాయుడు అల్లుడు అవుతారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు లభించింది. కింజరాపు ఎర్రన్నాయుడు కూడా బంధువు అవుతారు ఆయన చనిపోయారు. కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఇతనికి రిలేటివ్. అచ్చెన్నాయుడికి రాష్ట్ర వ్యవసాయ శాఖకు మంత్రిని చేశారు. బంధువులకు కేంద్ర, రాష్ట్ర స్థాయిలో మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి బండారు సత్యనారాయణమూర్తిని పక్కన పెట్టారేమో అని రాజకీయ పరిశీలకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి ఎక్కువ మంత్రి పదవులు ఇస్తే విమర్శలుకు దారి తీసినట్లు అవుతుందని చంద్రబాబు మూర్తిని ఈసారి సైడ్ చేసి ఉండవచ్చు.
బండారు సత్యనారాయణమూర్తి ఎక్కువగా వివాదాలకు వెళ్ళరు కానీ 2023లో ఓ మీడియా సమావేశంలో మాజీ ఏపీ పర్యాటక మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఫిర్యాదు మేరకు వెన్నెలపాలెంలోని నివాసంలో ఉన్న ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి ఆపై అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే మంత్రిగా ఎంపిక చేసేటప్పుడు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు లేదో తెలియదు కానీ ఈ సీనియర్ నేతకు మాత్రం ఈసారి కేబినెట్ లో చోటివ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: