కాంగ్రెస్ పార్టీ హవ మొదలైందా..?

Divya
2024 ఎన్నికలలో ఏదైనా పార్టీకి బాగా కలిసి వచ్చింది అంటే అది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పవచ్చు.. ఇక కాంగ్రెస్ పార్టీ తగ్గదని రాబోయే రోజుల్లో అందరిని కలుపుకొని వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తోంది. వాస్తవంగా 2014 సమయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక ప్రయత్నం బెడిసి కొట్టింది. 2004, 2009 సంకీర్ణ ప్రభుత్వాన్ని. నెమ్మదిగా మిత్రపక్షాలను పక్కనపెట్టి కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ఎదగాలని ప్రయత్నించింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి ముప్పు వచ్చింది. ఆ తర్వాత రెండవసారి కూడా ప్రయత్నం చేసింది..

అయితే దెబ్బ తిన్న తర్వాత ఈసారి అందరిని కలుపుకుంటూ వెళ్ళింది.. చాలా చోట్ల తగ్గి మరి మమతా బెనర్జీ అయిన, కేజ్రీ వాల్ అయినా, అఖిలేష్ యాదవ్ అయిన వాళ్లు ఆధిపత్యం వహిస్తామన్న రాష్ట్రాలకు అంగీకరించి తలవంచింది.. ఆ ఫలితమే ఇప్పుడు విజయాన్ని అందించింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అదే ధోరణిలో ప్రయత్నిస్తే తనకు బలం ఉన్నటువంటి ప్రాంతాలలో డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు 99 స్థానాలకు వచ్చింది. ఇలాగే చేసుకుంటూ ముందుకు వెళితే 150 సీట్లు టాప్ లో సాధిస్తే.. మిత్రపక్షాలన్నీ కలిపి మిగతా 150 సీట్లు సాధిస్తాయని చెప్ప వచ్చు.

ఒక్కసారి మోడీ హవా కూడా కాస్త తగ్గిపోయింది.కాబట్టి ఇప్పుడు ప్రపంచ స్థాయి పెట్టుబడులు నిధులు తమకు వెనకాల వస్తాయని అలాగే టూల్టిక్ గ్యాంగులన్నీ కూడా తమకు సహకరిస్తాయని అన్నటువంటి ధైర్యం కాంగ్రెస్కు వచ్చింది.. అంతేకాకుండా గత ఏడాది జరిగిన తెలంగాణ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలాచోట్ల ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చిన సందర్భాలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే రాబోయే ఐదు ఏళ్లలలో కాంగ్రెస్ పార్టీ మరింత ఊపు తీసుకొని పోటు బ్యాంకింగ్ మరింత పెంచుకొని అవకాశం అయితే కనిపిస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: