పవన్ కమిట్మెంట్ సూపర్..ఆ మహిళ కోసమే ఆ శాఖలు తీసుకున్నారా..?

Pandrala Sravanthi
పవన్ కళ్యాణ్ పేద ప్రజల కష్టాలను చూస్తూ పదిమందికి సాయం చేయాలనే గుణం కలిగిన వ్యక్తి. తాను హీరోగా ఎంతో సంపాదించుకునే సత్తా ఉన్నా కానీ, అవన్నీ వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.  దీనికి ప్రధాన కారణం హీరోగా ఉంటే తన డబ్బుతో కొంతమందికి మాత్రమే సాయం చేయగలుగుతాను అదే రాజకీయాల్లోకి వస్తే  రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేసే భాగ్యం కలుగుతుందని ఆలోచన చేసి జనసేన పార్టీని స్థాపించారు. దాదాపు పది సంవత్సరాలపాటు పార్టీని పట్టుకొని  ఎన్నో కష్టాలు పడ్డారు. అవమానాలు భరించారు.  చివరికి తను అనుకున్న విధంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడమే కాకుండా తాను కూడా మంత్రి అయ్యారు. ఇదే తరుణంలో తాను ఇచ్చినటువంటి ఎన్నో కమిట్మెంట్లను నెరవేర్చడానికి ముందడుగు వేశారు. 

ఇదే క్రమంలో ఒక 70 ఏళ్ల మహిళకు ఇచ్చిన మాట ప్రకారం ఆ ఊరికి న్యాయం చేయబోతున్నారు. ఆమె మాట కోసమే తాగునీటి సరఫరా మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారట పవన్ కళ్యాణ్. అయితే గతంలో ఆ మహిళతో పవన్ కళ్యాణ్ చెప్పిన వీడియో ప్రస్తుతం జనసైనికులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు.  పవన్ కళ్యాణ్ అరకు ప్రాంతంలో పర్యటనకు వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో మహిళలు రోడ్డుపై బిందెలు పెట్టారు. వెంటనే పవన్ కళ్యాణ్  కారు దిగి సరాసరి మహిళల దగ్గరికి వెళ్లారు.  ఈ టైంలోనే ఒక 70 ఏళ్ల మహిళ వారి తాగు నీటి కష్టాలను చెప్పడమే కాకుండా కళ్ళారా చూపిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ను తన వెంట తీసుకొని వెళ్ళింది. మెయిన్ రోడ్డుకు దాదాపుగా ఏడు కిలోమీటర్ల లోపలికి తీసుకెళ్లి ఒక భావి చూపించింది. ఆ బావిలో ఉండే నీరు చాలా మురికిగా  చెత్తాచెదారంతో ఉన్నాయి.

 ఆ నీటిని వీరు తీసుకొని వడపోసుకుని తాగుతారట. ఈ సీన్ చూసినటువంటి పవన్ కళ్యాణ్ కళ్ళలో నీళ్ళు తిరిగాయట. ఇదే సమయంలో ఆ మహిళ  మీ ప్రభుత్వం వస్తే మా ఊరిని గుర్తుపెట్టుకోండి సార్ అని చెప్పిందట.  ఏ విషయాన్ని పవన్ కళ్యాణ్ చాలా మీటింగ్లలో ప్రస్తావిస్తూ వచ్చారు. అంతేకాదు ఆ మహిళకి ఇచ్చిన మాట కోసం రాష్ట్రంలో ఎక్కడా కూడా నీటి సమస్య ఉండకూడదని డిప్యూటీ సీఎం పదవి తీసుకోవడమే కాకుండా తాగునీటి సరాఫరాల శాఖ బాధ్యతని కూడా పవన్ కళ్యాణ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అప్పుడు ఇచ్చిన మాట సంబంధించినటువంటి వీడియోను జన సైనికులు ప్రస్తుతం  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. ఆ మహిళకు ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ ఆ పదవి తీసుకోవడం చాలా గొప్ప పని, శభాష్ పవన్ కళ్యాణ్ కమిట్మెంట్ గొప్పది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: