పవన్ చేతికి పవర్.. ఇక పవర్ స్టార్ ను వదిలేస్తారా?

praveen
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు  ఏకంగా పోటీ చేసిన 21 చోట్ల కూడా గాజు గ్లాసు పార్టీ ఘన విజయాన్ని అందుకుంది. దీంతో అటు పవన్ కళ్యాణ్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. కాగా ఇటీవలే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. ఇక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.

 అంతేకాకుండా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు పవన్. అయితే ఇదంతా చూశాక పవన్ ఫ్యాన్స్ హ్యాపీగానే ఉన్నారు. కానీ ఒక విషయంలో మాత్రం సందిగ్ధంలో  పడిపోతున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎం గా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మళ్ళీ పవర్ స్టార్ గా సినిమాల్లో ప్రేక్షకులను అలరిస్తారా లేదా అనే విషయంపైనే అందరిలో ప్రశ్నలు నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దాదాపుగా పవన్ సినిమాలుకు గుడ్ బై చెప్పినట్లే అన్నది తెలుస్తుంది  ఎందుకంటే గతంలోనే రాజకీయాల్లోకి  వచ్చినప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ పార్టీని నడిపేందుకు  డబ్బులు కావాలంటే సినిమాలు తప్ప తనకు మరో ఆప్షన్ లేదుఅని స్వయంగా చెప్పిన పవన్ కొన్ని సినిమాలు చేశారు.

 ఇక ఇప్పుడు పవన్ కష్టపడి పార్టీని మంచి పొజిషన్లోకి తీసుకువచ్చారూ. దీంతో తన పూర్తిస్థాయి సమయాన్ని రాజకీయాలకు మాత్రమే కేటాయించే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్ లో అభిమానులు తనకిచ్చిన పవర్ స్టార్ అనే పదాన్ని వదిలేసి అవకాశం లేకపోలేదు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలను అయినా చేస్తారా లేకపోతే వాటిని కూడా పక్కన పెడతారా అన్నవిషయంపై కూడా ప్రస్తుతం టాలీవుడ్ లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఇక పవన్ ఏమనుకుంటున్నారు అన్నది ఆయన చెబితే గాని ఎవరికి తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: