పవన్ కళ్యాణ్ కంటే.. ఆయన భార్యకే ఎక్కువ ఆస్తులున్నాయా?

praveen
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడ చూసినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరే హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఎందుకంటే ఒకప్పుడు రాజకీయాలకు పనికిరాడు అనే విమర్శలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు ఏపీ రాజకీయాలలో కింగ్ మేకర్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఏకంగా టిడిపి బిజెపి పార్టీలను ఒక్కదాటిపై నిలబెట్టి.. కూటమి గెలుపుకు ఎంతగానో శ్రమించి విజయం సాధించారు  అంతేకాకుండా తన పార్టీ జనసేన అభ్యర్థులను నిలబెట్టిన 21చోట్ల గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్ సంపాదించాడు పవన్ కళ్యాణ్.

 ఇక ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగా.. పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి డిప్యూటీ సీఎం పదవిని అందుకున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం రాజకీయాల్లో కూడా సక్సెస్ఫుల్ పొలిటిషన్ గా మారిపోయారు జనసేనానీ. కాగా పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఏ విషయం వెలుగులోకి వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అయితే పవన్ అంటే తెలియని వేరే రాష్ట్రాల వారు సైతం ఇక ఇప్పుడు ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ ఆసక్తిని కనబడుతున్నారు. గూగుల్లో తెగ వెతికేస్తున్నారు అని చెప్పాలి.

 అయితే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా కూడా ఈమధ్య పబ్లిక్ లో యాక్టివ్గా కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న పవన్ ప్రమాణ స్వీకారాన్ని కార్యక్రమానికి కూడా ఆమె వచ్చారు. అయితే ఆమె గురించి తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి పెరిగింది. కాగా రష్యా కు చెందిన మోడల్ అన్నా లెజనోవా. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తీన్మార్ సమయంలోనే ఆమెకు పవన్ కి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. అయితే ఆమెకు ఏకంగా సింగపూర్లో 1800 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు వార్తలు ఉన్నాయి. ఒక రకంగా చూస్తే ఇది పవన్ కళ్యాణ్ ఆస్తులు విలువ కంటే ఎక్కువే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: