జ‌గ‌న్ ఎఫెక్ట్‌... ఏపీ టీడీపీ అధ్య‌క్షుడిని మార్చేసిన బాబు...!

Suma Kallamadi
గడిచిన ఐదేళ్ల కాలంలో ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ బీసీ మంత్రం చదివారని చెప్పవచ్చు. అందులోనూ యాద‌వుల‌కు బాగా ప్ర‌యార్టీ ఇచ్చారు. ఇప్పుడు అదే యాద‌వ వ‌ర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ రావుకు ఏపీ టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌విని ఇచ్చి ఆశ్చర్యపరిచారు చంద్రబాబు. టీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ రావు పేరు గట్టిగా వినిపిస్తోంది. అచ్చెన్నాయుడు స్థానంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడుగా పల్లా శ్రీనివాస్‍కు అవకాశాలు ఉన్నట్లు ప్రస్తుతం సైడ్ వర్గాల నుంచి టాక్ నడుస్తోంది.
బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్ వైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. బీసీ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పల్లా శ్రీనివాస్ గాజువాక ఎమ్మెల్యేగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఆయన 95,235 ఓట్లతో టీడీపీ నుంచి గాజువాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే అతనికి టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా బీసీ సామాజిక వర్గానికి దగ్గర కావాలని, వారికి తాను ఎప్పుడూ మంచి చేస్తాననే భావన కలిగించాలని చంద్రబాబు అనుకున్నట్లు తెలుస్తోంది. బహుశా జగన్ ఎఫెక్ట్ కారణంగా ఈ కీలకమైన పదవిని బీసీ నేతకు ఇచ్చినట్లున్నారు.
ఇకపోతే మంత్రి వర్గంలో కూడా చంద్రబాబు చాలామంది బీసీ నేతలకు చోటు కల్పించారు. బీసీ ఓటర్లు ఎక్కువగా ఓట్ చేయడం వల్ల చంద్రబాబు ఈసారి భారీ మెజారిటీతో గెలుపొందారు. వారికి కృతజ్ఞతా భావంగా చంద్రబాబు బీసీ ప్రజలకు ఉన్నత హోదాలను కల్పిస్తూ వారికి రాజ్యాధికారం కట్టబెడుతున్నారు. వారిని మొదటి నుంచి నెత్తిన పెట్టుకుంటూనే వస్తున్నారు చంద్రబాబు. బీసీ ప్రజలు కూడా బాబుకు ఎప్పుడూ సపోర్ట్ గా ఓట్లు వేస్తూ భారీ మెజారిటీతో గెలిపిస్తున్నారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలకు కూడా బాగానే ప్రాధాన్యత దక్కుతోంది. బీజేపీ వారిని కూడా చంద్రబాబు అక్కున చేర్చుకుంటున్నారు. అందరికీ సమ న్యాయం చేస్తూ పదవులు అందిస్తున్నారు. ఈసారి ఏం పాలన విషయంలో కూడా చాలా త్వరగా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలకు సంక్షేమ పథకాల విషయంలో స్పీడ్ తో దూసుకెళ్తున్నారు ఇప్పటికే పెన్షన్ల పెంపు పై సంతకం కూడా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: