విజయంతో కూడిన సవాళ్లు : ఇక పోలవరం పరుగులు పెట్టేనా..?

అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి మెజారిటీ స్థానాలు ఇచ్చి ఏపీ ప్రజలు చంద్రబాబుకు పట్టం కట్టారు. జనసేన , బి జె పి తో పొత్తులో ఉన్నప్పటికీ సింగిల్ గానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేట్టుగా ఏపీ ప్రజలు టిడిపిని గెలిపించారు. అయితే ఎన్నికల్లో గెలిచేందుకు అనేక హామీలు ఇచ్చిన చంద్రబాబుకు విజయంతో కూడిన సవాళ్లు ఎన్నో ఉన్నాయి. వాటిని జయించినప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రజల కలలు సాకారం అవ్వనున్నాయి . రాజధాని నిర్మాణం, ఉద్యోగాల కల్పన, సంక్షేమ పథకాలు అమలు చేయడం...అలాగే అధికారంలోకి వచ్చేందుకు టిడిపి ఇచ్చిన హామీలలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కూడా ఒకటి.

అయితే పోలవరం నిర్మాణంపై హామీలు ఇవ్వడం కొత్తేమీ కాదు. గతంలో ప్రతి ఎన్నికల్లోను ఆ ప్రాజెక్టు పై పార్టీలు హామీలు ఇచ్చాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు శూన్యమే. కానీ 2014 నుండి 2019 వరకు చంద్రబాబు పాలనలో మాత్రం పోలవరాన్ని కొంతస్థాయిలో పరుగులు పెట్టించారు. 'వారం వారం పోలవరం' పేరుతో సమీక్ష నిర్వహించి అన్ని సమస్యలు స్వయంగా పరిష్కరించుకుంటూ పనులు వేగంగా జరిగేలా కృషి చేశారు. చంద్రబాబు హయాంలో పోలవరంలో కీలక నిర్మాణాలు కొలికి వచ్చాయి.

పోలవరం ప్రధాన డ్యామ్ ను 64. 22% పూర్తి చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టుపై 4,730 కోట్లను ఖర్చు చేస్తే.... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంలో 10,649 కోట్లను వెచ్చించారు. ఇక జగన్ ప్రభుత్వంలో 5,877 కోట్లు మాత్రమే పోలవరం పై ఖర్చు చేశారు. ఇప్పుడు మరోసారి చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. దీంతో ఆయన పోలవరాన్ని పూర్తి చేస్తారని రైతులు నమ్మకం పెట్టుకున్నారు. పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయంలో మరింత ముందుకు దూసుకుపోతుంది. బీడు భూములు సస్యశ్యామలం అవుతాయి.  మరి ఆ నమ్మకాన్ని బాబు నిలబెట్టుకుంటారా...?  లేదా...? అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: