మరోమారు ఫలించిన మోదీ మంత్ర.. ఆ రికార్డును నరేంద్ర మోదీ తిరగరాశారుగా!

Reddy P Rajasekhar
మన దేశంలోని ప్రజలు గత పదేళ్లుగా నరేంద్ర మోదీని తప్ప మరెవరినీ నమ్మడం లేదనే సంగతి తెలిసిందే. దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ మాత్రమే తమకు సరైన న్యాయం చేయగలరని ప్రజలు భావిస్తారు. మూడోసారి కూడా దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని తేలిపోయింది. మోదీ సక్సెస్ మంత్ర మరోమారు ఫలించింది. మరోవైపు వార‌ణాసిలో మోడీ స‌రికొత్త రికార్డు సాధించారు.
 
మూడోసారి వారణాసి నుంచి పోటీ చేసి మూడోసారి విజయం దక్కించుకున్నారు. వారణాసిలో తనకు తిరుగులేదని మోదీ ప్రూవ్ చేయడం గమనార్హం. తాను గెలిచి పార్టీని గెలిపించాలనే సరైన వ్యూహంతో మోదీ ముందడుగులు వేసి తన లక్ష్యాన్ని సాధించారు. బీజేపీతో పొత్తు వల్ల ఏపీలో కూటమి సైతం అలవోకగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీని కూటమి చిత్తుచిత్తుగా ఓడించడం గమనార్హం.
 
మూడోసారి ప్రధాని కావడం ద్వారా మోదీ నెహ్రూ రికార్డ్ ను సమం చేసి రికార్డును తిరగరాశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏడు పదుల వయస్సులో సైతం ముందుచూపుతో సరైన దారిలో మోదీ ముందడుగులు వేయడంతో పాటు దేశ ప్రజలను సైతం సరైన దారిలో నడిపిస్తున్నారు. ఇండియా కూటమి అలవి కాని హామీలు ఇచ్చినా ప్రజలు మాత్రం మోదీకే పట్టం కట్టారంటే ఆయన అంటే ఎంత నమ్మకమో సులువుగా అర్థం చేసుకోవచ్చు.
 
మోదీకే మోదీనే పోటీ అని ఆయనకు పోటీనిచ్చే వాళ్లు సైతం లేరని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒడిశాలో విజయం విషయంలో మోదీ వ్యూహాలు సక్సెస్ అయ్యాయి. ఒడిశాలో 25 సంవత్సరాల తర్వాత బీజేపీకి దక్కిన విజయంతో ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్ర‌చారంలో క‌నీ వినీ ఎరుగ‌ని విధంగా దూకుడు చూపించిన మోదీ 5 ట్రిలియ‌న్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌తో మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాలకు ధీటుగా నిలబెట్టడానికి తన వంతు కృషి చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: