ఎగ్జిట్ పోల్స్ : టీవీ9 సర్వే.. బిఆర్ఎస్ ఏక్ నిరంజన్?

praveen
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల వేడి తగ్గకముందే పార్లమెంటు ఎన్నికలు రావడంతో మరోసారి తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీలు కూడా ఈ పార్లమెంట్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయ్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే  తప్పకుండా మూడోసారి విజయం సాధిస్తుంది అనుకున్న బిఆర్ఎస్ పార్టీ తక్కువ సీట్లు గెలిచి ప్రతిపక్షంతో సరిపెట్టుకుంటే.. ఇక తెలంగాణలో కనిపించకుండా పోతుంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం మెజారిటీ స్థానాలలో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది.

 అదే సమయంలో ఇక మునుపటితో పోల్చి చూస్తే ఎక్కువ స్థానాలను గెలుచుకున్న బిజెపి.. ఇక తమ పార్టీ బలాన్ని పెంచుకుంది అని చెప్పాలి. అయితే ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరికి మెజారిటీ వస్తుంది అనే దానిపై తీవ్రస్థాయిలో ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. మెజారిటీ తమకే వస్తుంది అంటూ అన్ని పార్టీలకు కూడా ధీమా వ్యక్తం చేశాయి  ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాల ప్రయత్నించాయి. అయితే మే 13వ తేదీన ఓటు వేసి అందరి భవితవ్యం తేల్చరు ప్రజలు. కాగా ఇక జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అంతకుముందే ఎగ్జిట్ పోల్స్ లో ఎలాంటి అంచనాలు వస్తాయి అనే విషయంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.

 అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అటు కారు పార్టీకి బిగ్ షాక్ తగలబోతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసిన కారు పార్టీ కేవలం ఏక్ నిరంజన్ అన్న విధంగా ఒకే స్థానానికి పరిమితం కావచ్చని టీవీ9 చెబుతుంది. ఇటీవల టీవీ9 సర్వే ప్రకారం కాంగ్రెస్ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో 8 స్థానాల్లో విజయం సాధించవచ్చు అని అంచనా వేస్తుంది. ఇదే సమయంలో గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు పొందిన బిజెపి ఈసారి మాత్రం ఏడు స్థానాల్లో తప్పకుండా విజయం సాధిస్తుందట. హైదరాబాద్ స్థానంలో ఎప్పటిలాగానే అసదుద్దీన్ ఓవైసీ విజయం సాధిస్తారని టీవీ9 ఎగ్జిట్ పోల్స్ సర్వే చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kcr

సంబంధిత వార్తలు: