వైసిపి ఓడితే.. అది బంద్.. సీఎం రికార్డే..!

lakhmi saranya
ప్రస్తుతం జరిగిన ఎన్నికల  పోరాటంలో వైసీపీ కనుక ఓటమి పాలు అయితే.. ఏం జరుగుతుంది? అంటే.. అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. దీనిలో ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం ఒక్క ఛాన్స్. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప‌ యాత్ర చేశారు. ఈ క్రమంలో ఒక ఛాన్స్ అంటూ.. ఆయన ప్రచారం చేయడం జరిగింది.
సుదీర్ఘ పాదయాత్ర మరియు ఒక్క ఛాన్స్.. ఈ రెండు కూడా ఆయనకు కలిసి వచ్చాయి. దీంతో అధికారంలోకి వచ్చారు. అది కూడా.. ఎవ్వరు కనివిని ఎరగని రీతిలో దూసుకుపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? పైకి గంభీరంగా తాము 151 కి పైగా‌ సీట్లు తెచ్చుకుంటామని చెబుతున్నారు. కానీ అంతర్గతంగా మాత్రం ఇంత వచ్చే అవకాశం లేదన్న విషయం జగన్కు బాగా తెలుసు. పట్టణ, నగర ఓటర్లు వైసీపీకి తీవ్రంగా వ్యతిరేకంగా ఉన్నారు. ఇక పెరిగిన ఎన్నారై ఓట్లు కూడా.. వైసీపీకి వ్యతిరేకం. ఉద్యోగుల ఓట్లు పూర్తిగా జగన్ను దింపేసేందుకు వేసినవని వారు చెబుతున్నారు.
ఇలా చూసుకుంటే... ఏ కోణం లో చర్చించుకున్న జగన్ పార్టీ వైసిపి గెలిచేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ దక్కించుకుంటుందా? అనేది పెద్ద సందేహం. అలాగని అంచనాలు తప్పక పోతే... మాత్రం జగన్ గెలవచ్చు.  ఇక్కడ ఒక కీలకమైన చర్చకు దారితీసింది. ఒక్క ఛాన్స్.. రేపు వైసిపి ఓడిపోతే.. కచ్చితంగా అది ఒక్క ఛాన్స్కే పరిమితమయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రజలను జగన్ అడిగింది ఒక్క ఛాన్సే. మనమే అర్థం చేసుకోవాలి అని ఎన్నికల సమయంలో పలువురు కీలక నేతలు చెప్పినట్టే జరిగితే.. ఇక ఒక్క ఛాన్స్ ముగిసిపోతుంది. భవిష్యత్తులోనూ జగన్కు ఈ ఒక్క ఛాన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ ఒక్క ఛాన్స్ గండం నుంచి ఆయన బయటకు వస్తారా? లేరా? అనేది జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది. ఓడితే మాత్రం ఒక్క ఛాన్స్ వైపే ప్రజలు మగ్గు చూపించారని భావించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: