ఆ మంత్రి గెలుపు కష్టమే అంటున్న వైసిపి నేతలు.. పార్టీలో ఒక్కటే చర్చ..!

lakhmi saranya
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మరోసారి బరిలో ఉన్న నాయకుడు  ధర్మాన ప్రసాదరావు. ఈయన మంత్రి కూడా. ఈయ‌న‌కు ఈసారి పెద్దగా పోటీ లేదని వైసిపి భావిస్తుంది. అందుకే గెలుపు గుర్రాల జాబితా లో మంత్రి ధర్మాన పేరును కూడా సీఎం జగన్ తెచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంచిదే ఏ పార్టీకైనా.. అధినేతకైనా కూడా ఏ మేరకు అంచనాలు ఉండాల్సిందే. కాదని ఎవరు అనలేదు.
కానీ క్షేత్రు స్థాయిలో పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు కూడా ధర్మాన గలుపు పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. నిజానికి ఈసారి శ్రీకాకుళం నియోజకవర్గంలో టిడిపి ప్రయోగం చేసింది. సాంప్రదాయ పద్ధతిలో ఈ టికెట్ను గుండ కుటుంబానికి కేటాయించాలి. గతంలో గుండ సూర్యనారాయణ ఆయన సతీమణి లక్ష్మీలకు చంద్రబాబు ఈ టికెట్ ఇచ్చారు.
ఇక‌ గత ఏడాది కూడా లక్ష్మీ పోటీ చేశారు. కానీ ఆమె ఓడిపోయారు. పైగా వయసు కూడా పెరగడంతో ఈసారి ఆమెకు పార్టీ బాధ్యతలు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో టీడీపీ నుంచి గోండు శంకరరావుకి కేటాయించారు. అయితే ఈయనకు టిడిపి శ్రేణులు పెద్దగా సహకరించలేదని స్థానికంగా ఒక టాక్ ఉంది. దీంతో సహజంగానే ధర్మాన కు పెద్ద పోటీ లేదు. ఉండదు కూడా. ఈ నేపథ్యంలో అందరూ ధర్మాన గలుపు ఖాయమని అనుకుంటున్నారు. కానీ ఇది నాణేనికి ఓవైపు మాత్రం. మరోవైపు చూస్తే తీవ్ర వ్యతిరేకత ఆయనను వెంటాడుతుంది.
ఎందుకంటే.. ధర్మాన పోలింగ్కు ముందే కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు. ఆయనకు అనుకూలంగా వ్యాపార వర్గాలు లేవని ఆయన ఓపెన్ అయిపోయారు. వ్యాపార వర్గాలు ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గంతో ఆయన నిర్వహించిన భేటీలోనూ ఈ విషయం చెప్పుకొచ్చారు. ఇక మరోవైపు రియల్ ఎస్టేట్ వ్యాపార వర్గం కూడా ధర్మానకు వ్యతిరేకంగా ఉంది. పార్టీలోనూ ఆయనను విభిందించేవారు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయన గలుపు పక్కా అంటూ వైసీపీ వర్గాల్లో ప్రజెంట్ చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: