ఎన్టీఆర్ టార్గెట్.. టిడిపి భయపడుతోందా..?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో... జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు అందరూ కలిసి మూకుమ్మడిగా జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. మొన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో... జూనియర్ ఎన్టీఆర్ చాలా సైలెంట్ గా ఉన్నారు. ఏ పార్టీకి కూడా సపోర్ట్ గానీ, మద్దతుగాని ప్రకటించలేదు.
కేవలం... హైదరాబాదులో మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా హైదరాబాదులో ఓటు వేశారు జూనియర్ ఎన్టీఆర్. ఆ సందర్భంగా బ్లూ కలర్ షర్టు వేసుకొని జూనియర్ ఎన్టీఆర్ రావడం కూడా పెద్ద వివాదంగా చూపింది తెలుగుదేశం సోషల్ మీడియా. వైసీపీకి మద్దతుగా బ్లూ కలర్ షర్ట్ వేసుకు వచ్చాడని జూనియర్ ఎన్టీఆర్ను టార్గెట్ చేసింది. ఇక ఇప్పుడు ఎన్నికలు అయిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ను వదలడం లేదు బుద్ధ వెంకన్న లాంటివారు.
 జూనియర్ ఎన్టీఆర్కు  అలాగే తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని... బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీలోకి వస్తానన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ ను చేర్చుకోపోమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.  కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియా వారియర్స్... జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసి మరి తిడుతున్నారు. అమ్మ నా బూతులు తింటున్నారు. వాస్తవానికి హీరోల మధ్య పోటీ ఉండాలి.... ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ తెలుగుదేశం అన్నట్లుగా వ్యవహారం మారిపోయింది.  

అయితే జూనియర్ ఎన్టీఆర్ ను తిడుతున్న తెలుగుదేశాన్ని వైసీపీ పార్టీ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తిట్టించేది చంద్రబాబు అంటోంది వైసీపీ.  జూనియర్ ఎన్టీఆర్ తాత స్థాపించిన పార్టీని లాక్కున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చాలా హీనంగా వ్యవహరిస్తున్నాడని వైసిపి ఫైర్ అవుతోంది. అయినప్పటికీ ఈ బాధలన్నీ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడు  మాత్రమే భరిస్తున్నాడని... వెంటనే తెలుగుదేశం పార్టీని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని వైసిపి చెబుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: