మోడీ వరుస ఇంటర్వ్యూల వ్యూహం వెనుక కథ ఏమిటి?

Suma Kallamadi
ప్రధాని మోదీ గడిచిన పదేళ్లలో పెద్దగా ఇంటరెస్ట్ చూపని విషయాలపట్ల ఇపుడు చూపుతుండడం ఆసక్తికరంగా మారింది. ఏదేశ ప్రధాని అయినా మీడియాతో టచ్ లో ఉంటారు. పోనీ కనీసం ఏడాదిలో ఒకసారైనా విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తూ తమ గురించి తాము చెప్పుకుంటూ ఉంటారు. కానీ.. మోడీ దానికి భిన్నం అని అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా విలేకరుల సమావేశాన్ని నిర్వహించటం ఆయనజీవితంలో చాలా తక్కువ. ఈ క్రమంలోనే ఆయన తన విదేశీ పర్యటనల సందర్భంగా మీడియా ప్రతినిధులను తనతో తీసుకెళ్లే పురాతన సంప్రదాయానికి స్వస్తి పలికేశారు. అలాంటిది ఇపుడు మోడీ.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండటం చాలా ఆసక్తికరంగా మారింది.
అవును, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఆయన ఈసారి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వరుస ఇంటర్వ్యూలతో మీడియాని హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయి మీడియా సంస్థలు నుండి ప్రాంతీయంగా కూడా పేరున్న సంస్థలు కొన్నింటికి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూలు ఇవ్వటం మనం చూశాము. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూలు లెక్కకు మించి అన్న చందంగా సాగుతోంది. అయితే అన్నింటిలోనూ ఒకటే లెక్క కనబడుతోంది. ఆయన్ను ప్రశ్నలు అడగాల్సిన వారు చాలా జాగ్రగా వ్యవహరించడం. మొన్నామధ్య టీవీ 9 ఇంటర్వ్యూ చూసినవారికి ఇది చాలా స్పష్టంగా అర్ధం అవుతుంది.
అంతేకాకుండా ప్రధాన మంత్రిని ఎలాంటి ప్రశ్నలు వేయాలి? ఇంటర్వ్యూ సందర్భంగా రిపోర్టర్ ఎలా వ్యవహరించాలి? లాంటి విషయాలు కూడా ముందే డిసైడ్ చేసుకొని మరీ చేస్తుండడం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది. ఈ క్రమంలోనే మోడిపైన కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటర్వ్యూ అంటే.. అదో ఫార్సులా తయారైందన్న విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి. ఇంటర్వ్యూలో కూడా ఆయన పెత్తనం చాలా స్పష్టంగా కనబడుతోంది అని అంటున్నారు. ఇంతకు మునుపు ఎప్పుడూ ఇంటర్వ్యూలు జోలికి పోని మోడీ.. ఈసారి అందుకు భిన్నంగా రియాక్టు అవుతూ.. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కారణం ఒక్కటే. తన వాణిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న తపన. తన పట్ల ప్రజలు ఎల్లపుడూ పాజిటివ్ గా రియాక్టు కావాలన్న ధోరణిలోనే అలా చేస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: