కౌంటింగ్ వేళ.. కూటమి, వైసిపికి కొత్త టెన్షన్?

praveen
పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ముగిసిన తర్వాత కూడా ఆంధ్రాలో రాజకీయం చల్లార లేదు. పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయ్. ఏకంగా ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై దారుణంగా దాడులు చేసుకోవడం జరిగింది. దీంతో పోలీసులు కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించడం సంచలనగా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఈసారి ఎన్నికల్లో భారీ గానే అటు పోలింగ్ శాతం నమోదు కావడంతో ఫలితాలు తమకు అనుకూలంగా వస్తాయని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 రాష్ట్రంలో రెండవసారి వరుసగా అధికారాన్ని చేజిక్కించుకుంటామని వైసిపి చెబుతుంటే.. ఇక జగన్కు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారని కూటమి అధికారంలోకి రాబోతుంది అని టిడిపి జనసేన బిజెపి పార్టీలు చెప్పుకుంటున్నాయ్. ఈ క్రమంలోనే ఇక ఎవరు గెలుస్తారు అనే విషయంపై అంతట ఉత్కంఠ నెలకొంది అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు ఒక ఎత్తు అయితే నాలుగవ తేదీన జరిగే కౌంటింగ్ మరో ఎత్తు  ఎందుకంటే పోలింగ్ సమయంలోనే ఏమాత్రం ఏమరుపాటుగా  ఉన్న రిగ్గింగ్ చేసే అవకాశం ఉందని.. దొంగ ఓట్లు పోల్ అవుతాయని భావించిన అన్ని పార్టీల నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎంతో అలర్ట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు కౌంటింగ్ సమయంలో కూడా అప్రమత్తంగా ఉండని పక్షంలో ఫలితాలు తారుమారు చేస్తారన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు అన్ని పార్టీల నేతలు.

  ఇక ఏపీలోని కూటమికి అటు అధికార వైసీపీలో కూడా కొత్త టెన్షన్ మొదలైంది. అయితే పోలింగ్ కి కౌంటింగ్ కి మధ్య దాదాపు మూడు వారాల గ్యాప్ వచ్చింది. దీంతో మొన్నటి వరకు ప్రచార హోరులో బిజీగా గడిపిన నేతలు అందరూ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుండగా.. ఇక పోలింగ్ కు వేళ అవుతుండడంతో మళ్ళీ అలర్ట్ అవుతున్నారు. కౌంటింగ్ రోజు అనుసరించాల్సిన విధి విధానాల గురించి చర్చలు జరుపుతున్నారు. ఇలా మొన్నటి వరకు పోలింగ్ టెన్షన్ లో ఉన్న నేతలు పార్టీ కార్యకర్తలందరూ ఇక ఇప్పుడు కౌంటింగ్ టెన్షన్ పట్టుకుంది. ఈ క్రమంలోనే కౌంటింగ్ సమయంలో ముఖ్యమైన క్యాడర్ మొత్తం అందుబాటులో ఉండాలని.. ఇక పార్టీలోని కీలక నేతలందరూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మరోవైపు కౌంటింగ్ రోజు ఇలాంటి అవాంఛత ఘటనలు జరగకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడంలో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: