ఏపీ లో ఈ పద్ధతిలో కౌంటింగ్..!

Pulgam Srinivas
మే 13వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఇక జూన్ 4 వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంది. ఈ రోజు ఏ అసెంబ్లీలో ఎవరు గెలిచారు. ఎవరు అధికారం లోకి రాబోతున్నారు అనే విషయాలపై పూర్తి క్లారిటీ వస్తుంది. ఇక ఎన్నికల కమిషన్ ఓటింగ్ డే ను దాదాపుగా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. ఒకటి , రెండు చోట్ల కొన్ని చెదురు , మొదలు సంఘటనలు మినహాయిస్తే రాష్ట్రమంతా సజావు గానే ఎలక్షన్ లు పూర్తి అయ్యాయి.

ఇక ఎలక్షన్ల కంటే కూడా ఓటింగ్ ప్రక్రియ ను ఇంకా సజావుగా జరిపించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి నుండే ఎన్నో ప్రణాళికలను వేస్తూ వచ్చింది. ఇకపోతే జూన్ 4 వ తేదీన జరగబోయే ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి పూర్తి ప్రణాళికను ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇక జూన్ 4 వ తేదీన ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది అనే వివరాలను తెలుసుకుందాం.

జూన్ 4 వ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమంలో భాగంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి అసెంబ్లీ కి 14 టేబుల్స్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రమంతా కూడా ఇలానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ఒక్కో రౌండ్ కు 14 టేబుల్స్ ఉండబోతున్నాయి. ఒక సారి 14 టేబుల్స్ లో కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత మొదటి రౌండ్ ఫలితాలు వస్తాయి. ఇలాగే ప్రతి రౌండ్ కి ఉండబోతుంది. ఇక పార్లమెంట్ స్థానాల ఓట్ల లెక్కింపు కూడా ఇదే ప్రాతిపదికన జరగనున్నట్లు తెలుస్తోంది.

దీనిలో కూడా ఒక్కో రౌండ్ కు 14 టేబుల్స్ ఉండబోతున్నట్లు , ఆ 14 టేబుల్స్ లలో కలిపి వచ్చిన ఫలితాలను ఒక సారి విడుదల చేయనున్నట్లు ఇలా ఒక్కొక్క రౌండ్ కు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మొదట మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు. ఆ ఓట్ల లెక్కింపు అనంతరం ఈవీఎం ల లెక్కింపు స్టార్ట్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ap

సంబంధిత వార్తలు: