రాయలసీమ: టిడిపి మహిళ నేతలు గెలిస్తే రికార్డే..!

Divya
అనంతపురం జిల్లాలోని రాజకీయాలు అంటే అంత ఆషామాసి విషయం కాదు.. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.ఇందులో నాలుగు అసెంబ్లీ స్థానాల నుంచి టిడిపి పార్టీ నుంచి మహిళలే పోటీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ నలుగురు గెలిస్తే రాయలసీమలో ఒక సరికొత్త రికార్డు కూడా నమోదు అవుతుంది. అయితే ఇందులో పోటీ చేసిన వారిలో ఒకరు మాజీ మంత్రి కాక మరొకరు సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు మరి ఇద్దరూ కొత్తవారు కావడం గమనార్హం.

రాప్తాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సున్నిత పోటీ చేశారు. ఆమె గతంలో పెనుగొండ రాప్తాడు నుంచి కూడా గెలిచారు. రాప్తాడు సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తో ఆమె మళ్ళీ ఈసారి పోటీ పడింది. ఒకవేళ ఆయన మీద గెలిస్తే రికార్డే అని చెప్పవచ్చు..

సింగనమల ఎస్సీ నియోజకవర్గంలో బండారు శ్రావణి పోటీ చేశారు. గత ఎన్నికలలో ఆమె జొన్నలగడ్డ పద్మావతి చేతిలో ఓటమిపాలైంది. ఈసారి ఎన్నికలకు ఈమెకి చంద్రబాబు టికెట్ ప్రాధాన్యత ఇచ్చారు టిప్పర్ డ్రైవర్ కి ఆపోజిట్ గా ఈమెను నిలబెట్టడం జరిగింది.

పెనుగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎస్. రామచంద్రారెడ్డి కుమార్తె టిడిపి అభ్యర్థిగా సవితమ్మని పోటీగా నిలబెట్టారు. వైసీపీ నుంచి మాజీ మంత్రి ఉష శ్రీ చరణ్ ని అక్కడ పోటీలో దింపారు. గతంలో ఈమె కళ్యాణ్ దుర్గం నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఈసారి సీటు మార్చారు జగన్.

పుట్టపర్తి నియోజకవర్గం నుంచి ఈసారి ఎన్నికలలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కాకుండా ఆయన కోడలు పల్లె సింధూర రెడ్డికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. ఈ నియోజకవర్గ నుంచి వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే దిద్దికుంట శ్రీధర్ రెడ్డి నిలిచారు.
మొత్తం మీద చూసుకుంటే రాయలసీమలో మిగతా మూడు జిల్లాలలో పోలిస్తే అనంతపురం జిల్లాలో నలుగురు మహిళలకు అవకాశం వచ్చింది మరి పేరు గెలుస్తారో లేదో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: