వైసిపి: పార్టీది విశ్వాసమా.. అతివిశ్వాసమా..?

Divya
ఆంధ్రప్రదేశ్లో మరొకసారి వైసీపీ పార్టీ అధికారం రాబోతోందని ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా జగన్ ప్రమాణస్వీకారానికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఇందుకోసం వైసిపి నేతలు విశాఖకు వచ్చేందుకు కూడా పలు రకాల హోటల్స్ ను కూడా విమానాలను ప్రైవేటు బస్సులను బుక్ చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ధరలు భారీగానే పెరిగిపోయినట్లు తెలుస్తోంది. అసలు ఫలితాలు రాకుండా అని ఎందుకు ఇంత హంగామా చేస్తోంది.ఇది వైసిపి పార్టీ  విశ్వాసమా లేక అతి విశ్వాసమా అనేది టిడిపి నేతలు భయాన్ని చూపిస్తోంది.. వైసిపి నేతల ధీమా ఏంటో తెలియక చాలా సతమతమవుతున్నారు.

ముఖ్యమంత్రి జగన్ కు రెండవసారి అధికారం వస్తుందని చాలా ధీమాతో ఉంటున్నారు. ఎన్నికల తర్వాత ఐ-  ప్యాక్ టీం తో మాట్లాడి 2019లో వచ్చిన 151 అసెంబ్లీ 22 ఎంపీ సీట్ల కంటే ఈసారి మరింత విజయాన్ని అందుకుంటామని చెప్పి సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు అయితే ఈ నెల 30వ తేదీన తిరిగి రాబోతున్నట్లు తెలుస్తోంది. పోలింగ్ సరళ చూసిన తర్వాత వైసీపీ శ్రేణులు నిజంగానే జగన్ చెప్పినట్లుగా 151 యొక్క సీట్లు కంటే ఎక్కువగా రాబడతాయి అనే సందేహాలు కూడా మొదలైనప్పటికీ.. జగన్ ఎప్పుడూ కూడా ప్రచారం కోసం చెప్పే వ్యక్తి కాదు అని ఆయన చెప్పారంటే కచ్చితంగా ఆయన మాటకు విలువ ఉంటుందని వాదన ఇప్పుడు వినిపిస్తోంది.

బొత్స, ఐ వి సుబ్బారెడ్డి వంటి నేతలు సీఎం జగన్ రెండవసారి ప్రమాణ స్వీకారం చేయడానికి జూన్ 9 విశాఖలోని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే విధంగా తెలియజేశారు. దీంతో ఒక్కసారిగా టిడిపి నేతలలో మరొకసారి భయాన్ని పుట్టించేలా చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికలో కూడా జగన్ చెప్పిన విధంగానే సీట్లు వస్తాయంటూ సర్వేలు కూడా అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ సమయంలోనే అతి చంద్రబాబు క్యాంపు నుంచి మౌనంగా ఉండడంతో ఫలితాలు ఉత్కంఠంగా మారుతున్నాయి. 2019లో 51% ఓటింగ్ చిర్రా పట్టిన వైసీపీ 151 సీట్లను గెలుచుకుంది. గతంలో కంటి ఈసారి రెండు శాతం ఓటింగ్ పెరిగింది కనుక మరి అది ఎవరికీ కలిసి వస్తుందో చూడాలి. అంతేకాకుండా 1.69 కోట్ల మంది మహిళలు ఓటు వేశారని మెజారిటీకి తప్పక మాకే వస్తుందని విధంగా వైసీపీ నేతలు తెలియజేస్తున్నారు. మరి జూన్ 4న ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: