ఏపీ: ఓటు కోసం వచ్చి.. సజీవ దహనమైన ఐదుగురు..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఇతర ప్రాంతాలలో ఉండే ప్రజలు  ఓటు వేయాలని హక్కుతో చాలామంది సొంతూరు పైన మమకారంతో దృఢ సంకల్పంతో కుటుంబం అంతా కూడా స్వస్థలానికి రావడం జరిగింది.. అలా రెండు మూడు రోజులు ఉండి సంతోషంగా గడిపి.. తిరిగి ప్రయాణాన్ని కొనసాగిస్తున్న కొంతమంది ప్రజలు  ప్రైవేట్ ట్రావెల్స్ లో తిరుగు ప్రయాణం చేస్తున్నారు.అంతలోనే అనుకోకుండా మృత్యువు టిప్పర్ రూపంలో దూసుకు వచ్చి బస్సు డ్రైవర్ తో సహా నాలుగు నిండు ప్రాణాలను సైతం బలి కొనింది.. సెకండ్లలోనే అగ్ని కి ఆహుతై విషాదఛాయలు ఏర్పడ్డాయి. వీటికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
అయితే స్థానికులు తెలిపిన వివరాల మేరకు బాపట్ల జిల్లా చిన్నగంజాం నుంచి పర్చూరు చిలకలూరిపేట మీదకు హైదరాబాద్కు వెళుతున్నటువంటి ఒక బస్సు నిన్నటి రోజున రాత్రి 40 మంది ప్రయాణికులతో బయలుదేరిందట.. అయితే వీరందరూ కూడా ఓటును వినియోగించుకుని హైదరాబాదుకు తిరుగు ప్రయాణం అవుతున్న వారే నిన్నటి రోజున అర్ధరాత్రి 1:30 సమయంలో చిలకలూరిపేట అన్నంపట్లవారి పల్లె పసుమర్రు గ్రామాల వద్ద రోడ్డు వద్దకు వచ్చేసరికి ఎదురుగా చాలా వేగంతో కంకర టిప్పర్ వచ్చి బస్సును ఢీ కొనింది.. కొద్దిక్షణాలలో ఆ టిప్పర్ నుంచి మంటలు కూడా చెరరేగిపోయాయి.. దీంతో ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో బస్సుకు కూడా వ్యాపించాయి.

దీంతో వెంట వెంటనే బస్సు చుట్టూ ఈ మంటలు వ్యాపించడంతో ఇందులో నలుగురు సజీవంగా ఆహుతి అయిపోయారు.. మరో 20 మంది వరకు తీవ్ర గాయాలయ్యారు.. ఈ విషయం తెలుసుకున్న బంధువులు శోకసముద్రంలో మిగిలిపోతున్నారు.a స్థానికులు దుర్ఘటన సమాచారాన్ని పోలీసులకు తెలియజేయడంతో హుటాహుటిగా పోలీసులు ప్రమాదవ దృశ్యాన్ని పరిశీలించారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలు ఆర్పడంతో కాస్త పరిస్థితి అదుపులోకి వచ్చింది. ముఖ్యంగా తారు రోడ్డుపైన మట్టి ఎక్కువగా ఉండటం తిప్పరు వేగంగా రావడం ఆ వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: