మరికొన్ని గంటల్లో ప్రభాస్ కల్కి ట్రైలర్.. మరి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “.. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ

 భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. జపనీస్, చైనీస్ భాషల్లో కూడా సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్సె సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి. ఈ చిత్రంలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ అయిన బుజ్జి అనే కారును దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో తిప్పుతూ సినిమాపై బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు. ఇక మూవీ ట్రైల‌ర్‌ను జూన్ 10న విడుద‌ల చేయ‌నున్నారు. సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు ట్రైల‌ర్ విడుద‌ల కానుంది.క‌ల్కి 2898AD చిత్రాన్ని వైజయంతి మూవీస్

 బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కల్కి సినిమా జూన్‌ 27న విడుదల కానున్నడంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ వేడుక కోసం పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖలను ఆహ్వానించే పనిలో కల్కి టీమ్‌ ఉందట. జూన్‌ 23న కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్నట్లు సోషల్‌ మీడియాలో ఒక వార్త వైరల్‌ అవుతుంది.  మరి చివరిగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుపుతారు అన్నది తెలియాలి అంటే దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: