ఆ స్టార్ హీరో ఇంటి పక్కనే ఇల్లు తీసుకున్న యానిమల్ బ్యూటీ..!?

Anilkumar
కేవలం ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది తృప్తి. బాలీవుడ్  ఇండస్ట్రీ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.  యనిమల్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇందులో రణబీర్ రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించారు. తృప్తి ఒక కీలక పాత్రలో మెరిసింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన వారి కంటే తృప్తికి ఎక్కువ గుర్తింపు వచ్చింది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నట్లుగా సమాచారం వినబడుతుంది.

 ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ తెలుగులో కూడా భారీ బడ్జెట్ తో వస్తున్న ఒక సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది .ఆ సినిమా మరేదో కాదు సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప టు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తృప్తి ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించపోతున్నట్లు గా సమాచారం. దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ ఇదే వార్త సోషల్ మీడియాలో దుమ్ము లేపు తోంది. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ఈమెకి సంబంధించిన ఒక వార్త సోషల్

 మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ఈ బ్యూటీ ముంబైలో వేలకోట్ల ఆస్తులను కూడా పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం  సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ముంబైలో స్టార్ సెలబ్రిటీలు ఉండే బడా ఏరియా లో ఒక ఇల్లు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. రణబీర్ కపూర్ ఆలియా భట్ సల్మాన్ షారుక్ ఖాన్ వంటి స్టార్ హీరోలు ఉండే ఏరియాలో రెండు అంతస్తుల బంగ్లాను కొనుగోలు చేసిందట. సుమారు 14 కోట్ల రూపాయలతో ఆ బిల్డింగ్ కొనుగోలు చేసిందట ఈ బ్యూటీ. అంతేకాదు ఇప్పటికే అదనంగా లక్షలు ఖర్చు చేసిందట. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: