పెరిగిన పవన్ బాధ్యత... ఇక అందరూ చూపు ఆయన వైపే..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014 వ సంవత్సరంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత జరిగిన 2019 అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలలో తన పార్టీ నుండి అభ్యర్థులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఎన్నికల బరిలో నిలిపాడు. కానీ అందులో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు అసెంబ్లీ స్థానాలలో పోటీ చేస్తే రెండింటిలో ఓడిపోయాడు. ఇక ఈ పార్టీ నుండి ఒక్క ఎంపీ స్థానము రాలేదు. ఈ పార్టీ నుండి కేవలం ఒకే ఒక్క వ్యక్తి ఎమ్మెల్యే గా గెలుపొంది అసెంబ్లీ లోకి అడుగు పెట్టాడు.

దీనితో పవన్ కళ్యాణ్ కి గానీ , అతని పార్టీ కి గానీ ఆంధ్ర ప్రజలు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వలేదు అని స్పష్టంగా అర్థం అయిపోయింది. ఇక 2024 ఎన్నికలు కొన్ని రోజుల క్రితమే జరిగాయి. ఇందులో భాగంగా జనసేన పార్టీ టి డి పి , బి జె పి లతో పొత్తుల భాగంగా పోటీ చేసింది. అందులో భాగంగా జనేసేన పార్టీ  21 అసెంబ్లీ , 2 పార్లమెంట్ స్థానాలను తీసుకుంది. జనసేన నుండి పోటీ చేసిన ప్రతి అభ్యర్థి గెలుపొందాడు.

దీనితో ఈ ఎన్నికలలో జనసేన పార్టీ కి 100% విజయం లభించింది. ఇక ఈ విజయంతో పవన్ పై బాధ్యత చాలా పెరగనుంది. ఎందుకు అంటే 2019 ఎన్నికలలో ఆంధ్ర ప్రజలు ఈయనను ఏ మాత్రం నమ్మలేదు అని చెప్పవచ్చు. కానీ ఈ సారి మాత్రం 100% రిజల్ట్ ను అందించారు. దానితోనే అర్థం అవుతుంది ఈ సారి పవన్ ను వారెంతగా నమ్మారు అనేది. ఇక ఆ నమ్మకం నిలబెట్టుకోవాల్సిన అవసరం పవన్ పై ఎంతైనా ఉంది. దానితో పవన్ ఆ బాధ్యతను ఏ స్థాయిలో నిర్వహిస్తాడో , దాన్ని బట్టి 2024 ఎన్నికలలో జనసేన కు వచ్చే సీట్లు ఆధారపడి ఉంటాయి అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: