అఫీషియల్ : వైవిఎస్ చౌదరి కొత్త సినిమా అప్డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో వై వి ఎస్ చౌదరి ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఈ దర్శకుడు కొంత కాలం క్రితం సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన రేయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయాన్ని అందుకుంది.
 

ఈ సినిమా తర్వాత ఈయన ఏ సినిమాకు దర్శకత్వం వహించలేదు. ఇకపోతే తాజాగా ఈయన తదుపరి సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... వై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ ను రేపు అనగా జూన్ 10 వ తేదీన ఉదయం 8 గంటల 45 నిమిషాల 01 సేకెన్ కి విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు.

ఇకపోతే రేపు ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ ను విడుదల చేస్తారా అనేది చూడాలి. మరి చాలా కాలం గ్యాప్ తర్వాత వై వి ఎస్ చౌదరి దర్శకత్వం వహించబోయే సినిమా కావడంతో ఆ సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది. మరి ఈయన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో , హీరోయిన్లు ఎవరు అనేది చూడాలి. ఈయన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటీనటులు , టెక్నీషియన్స్ కనుక టాప్ స్థానం లో ఉన్నవారు అయితే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగి అవకాశం ఉంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన అనేక వివరాలు రేపు వెలువడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: