అన్నామలై అంటే మోదీకి ఎందుకంత ప్రేమ.. అసలు ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..??

Suma Kallamadi
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. కానీ ఏదో ఒక రోజు ఇక్కడ అత్యధిక సీట్లు గెలుచుకుంటామనే నమ్మకంతో మోదీ ఉన్నారు.. తమిళనాడులో బీజేపీ చీఫ్‌ అన్నామలై ఈసారి బాగా కష్టపడ్డారు కానీ పార్టీ ఓటమి పాలైంది. అన్ని ఎంపీ సీట్లను DMK పార్టీయే కైవసం చేసుకుంది. అన్నామలై మాత్రం నిరుత్సాహ పడలేదు. తాను కరుణానిధి కొడుకునై ఉంటే బీజేపీని ఎక్కువ చోట్ల గెలిపించి ఉండేవాడిని ఆయన కామెంట్లు చేశారు. అయితే ఇంతకుముందు తమిళనాడులో బీజేపీ పార్టీ ఉనికి శూన్యం. ఇక్కడ కమలం పార్టీకి కొంచెం కూడా ప్రజాదరణ లేదు కానీ అన్నామలై వల్ల అక్కడ ఇప్పుడు బీజేపీ పేరు మార్మోగుతోంది.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి 3.66% ఓట్లు సంపాదించింది. 2024 ఓటు షేర్   11.24%కి ఎగబాకింది. అన్నామలై కారణంగానే డబుల్ డిజిట్ ఓటు షేర్ సంపాదించామని మోదీ చెప్పారు. nda సమావేశంలో మోదీ మాట్లాడుతూ తమిళనాడులో సీట్లు గెలుచుకోకపోయినా ఓట్ల శాతం సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు తన కేబినెట్‌లోకి అన్నామలైని ఆహ్వానించారు. అన్నామలై ద్వారానే తమిళనాడులో ఎదగాలని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ప్రయత్నాలన్నీ. ఓడిపోయినా సరే అన్నామలైకు కేంద్రమంత్రి పదవి ఇవ్వడం ద్వారా తమిళనాడు పట్ల తమకు ప్రేమ ఉన్నట్లు తెలియజేయాలని బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది.
అన్నామలై అసలు పేరు కుప్పుసామి అన్నామలై. ఈయనకు కర్ణాటకలో ఐపీఎస్ ఆఫీసర్‌గా పనిచేసిన చరిత్ర ఉంది. ఐపీఎస్ ఆఫీసర్‌గా ఉడుపి, చిక్‌మగ్‌లూర్, బెంగళూరు నగరాల్లో ఎక్కువగా సేవలందించారు. చాలా డేరింగ్ అండ్ డైనమిక్‌గా పనిచేసిన అన్నామలై "రియల్ సింగం" అనే పేరు కూడా సంపాదించారు.2019లో చిన్న వయసులోనే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి రిజైన్ చేసి తమిళనాడు రాష్ట్రం, కరూర్‌ జిల్లాలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం మొదలు పెట్టారు. దీనికంటే ముందు పోలీస్ జాబ్ చేస్తున్నప్పుడు 2018లో మానస సరోవర ట్రిప్‌కి వెళ్లారు. అప్పుడే సేంద్రియ వ్యవసాయం చేయాలని ఆలోచన వచ్చింది. అంతే సంవత్సరం తిరిగేలోపే ఆ కలని నెరవేర్చుకునేందుకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి షాక్ ఇచ్చారు.
ఆపై రజనీకాంత్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమయ్యారు కానీ రజనీ పోటీ చేయకుండానే ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. దీంతో అన్నామలై కాషాయ కండువా కప్పుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తమిళ రాజకీయాలలో సర్వైవ్‌ అయ్యారు. పార్టీ క్యాడర్‌ని చాలా బాగా ప్రొటెక్ట్ కూడా చేశారు. బీజేపీ బలోపేతం చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. ఆ కారణంగా అతను హైకమాండ్ దృష్టిలో పడ్డారు. అతనిలోని సామర్ధ్యాన్ని గుర్తించిన బీజేపీ వెంటనే తమిళనాడులో పార్టీ చీఫ్‌గా నియమించారు. బీజేపీకి ఓటు షేర్ పెంచి తనపై పార్టీ పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. ఇలాంటి నేత తమ వైపు ఉంటే బీజేపీ తమిళనాడులో కచ్చితంగా అధికారంలోకి వస్తుందని మోదీ విశ్వసించారు అందుకే పిలిచి మరీ అన్నామలైకి కేబినెట్‌లో ఛాన్స్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: