చేవెళ్ల ఓటరు తీర్పు విలక్షణం.. ఆ లెక్కన గెలిచేది ఆయనే?

praveen
రాష్ట్ర రాజధానిని ఆనుకొని ఉన్న చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్లో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ఉంటుంది. ఎందుకంటే ప్రధాన పార్టీల మధ్య ఎప్పుడూ ఇక్కడ రసవత్తర  పోరు సాగుతూనే ఉంటుంది.  ఇక ఇప్పుడు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇదే రిపీట్ అయ్యేలా ఉంది. అంతేకాకుండా గ్రామీణ, పట్టణ ప్రాంతాలను కలుపుకొని ఉన్న ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఓటర్లు ఎప్పుడు విలక్షణమైన తీర్పును ఇస్తూ ఉంటారు అని చెప్పాలి.

 దీంతో ఈసారి ఇక్కడి నుంచి ఎవరు గెలవబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది. కారు దిగి హస్తం పార్టీలోకి వెళ్లిన సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బిజెపి నుంచి ఇక గతంలో బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వెళ్లిన మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి బరిలోకి దిగారు. ఇక బిఆర్ఎస్ నుంచి బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీలో ఉన్నారు.. ఇక ఈ ముగ్గురు నేతల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇప్పటివరకు ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో మూడుసార్లు ఎన్నికలు జరగగా ఒకసారి కాంగ్రెస్ రెండుసార్లు బిఆర్ఎస్ పార్టీలు విజయం సాధించాయి.

 అయితే ప్రస్తుతం రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంతో రాజకీయ సమీకరణలు కూడా మారిపోయాయి. అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక్కసారి ఎంపీగా గెలిచిన వ్యక్తి మరోసారి గెలిచిన దాఖలాలు లేవు. ఇక ఈ సెంటిమెంట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇప్పటికే ఎంపీలుగా పనిచేసిన కొండ విశ్వేశ్వర్ రెడ్డి, రంజిత్ రెడ్డిలు కాకుండా బిఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ విజయం సాధించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే వరుసగా రెండుసార్లు బిఆర్ఎస్ ఇక్కడ నుంచి పోటీ చేసి గెలిచింది. ఇక ఇప్పుడు హ్యాట్రిక్ పై కూడా కన్నేసింది. బీసీ బిడ్డను నిలబెట్టాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లింది బిఆర్ఎస్. మరోవైపు కాసాని జ్ఞానేశ్వర్ కు అపారమైన రాజకీయ అనుభవం ఉండడం.. ఇక సేవా కార్యక్రమాలతో మంచి పేరు ఆదరణ కూడా సంపాదించారు.


 ఇంకోవైపు కొండ విశ్వేశ్వర్ రెడ్డి పై ఉన్న వ్యతిరేకత.. ఇక రంజిత్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధికి ఏమి చేయలేదని అసంతృప్తితో ఇక ప్రజలు కాసాని జ్ఞానేశ్వర్ వైఫై ఉన్నారు అన్న టాప్ నడుస్తుంది. ఇలా ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవడు అనే  సెంటిమెంట్.. ప్రస్తుతం బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థులపై ఉన్న వ్యతిరేకత.. ఇక ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో బిఆర్ఎస్ పట్టు.. ఇవన్నీ కలుపుకొని ఈసారి కాసాని జ్ఞానేశ్వర్ విజయం సాధించబోతున్నారు అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: