కేటీఆర్ : అందుకే జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను గెలిపించాలి..?

Pulgam Srinivas
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ పార్టీని , తమ పార్టీ సభ్యులను గెలిపించడం కోసం తన వంతు కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా చాలా రోజుల నుండి అనేక ప్రాంతాలను పర్యటిస్తూ నాయకులకు , కార్యకర్తలకు పూర్వపూ జోష్ ను నింపడం మాత్రమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక దొంగ హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ ఇచ్చిన ఏ  హామీని నెరవేర్చలేదు వాటిని గుర్తుపెట్టుకొని పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అని చెప్తూ వస్తున్నారు.

ఇకపోతే ఈయన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన నాయకులను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా చేవెళ్ల ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చారు. జ్ఞానేశ్వర్ గురించి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ... బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఈ లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

తన జీవితాన్ని మొత్తం వెనుకబడిన కులాల కోసం అంకితం చేసిన కాసాని గారు.. 93 బీసీ కులాలను ఒక్క వేదికపైకి చేర్చి.. అరుదైన ఘనత సాధించారు. కాసాని జ్ఞానేశ్వర్‌ని పార్లమెంట్‌ కు పంపితే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు పోరాటం చేస్తారు.. చేవెళ్ల సమస్యలపై గొంతెత్తుతారు. చేవెళ్లకు చిల్లి గవ్వ ఇవ్వని బీజేపీ పార్టీ ఒక వైపు , పదవుల కోసం పార్టీలు మారే నీతిలేని కాంగ్రెస్ అభ్యర్థి మరో వైపు.. ఇరు పార్టీలకు గుణ పాఠం చెప్పాలంటే బహుజన గొంతు కాసాని గెలవాలి. ఈ ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించిన బీ ఆర్ ఎస్ పార్టీకే మద్దతిద్దాం కాసాని జ్ఞానేశ్వర్ గారిని ఎంపీగా గెలిపించుకుందాం అని రాసుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: