ఏపీ: వైసిపి సీట్లు తగ్గడానికి ముఖ్య కారణం వారేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా ఈసారి ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం ఉనికి కోసం చాలా గట్టి ప్రయత్నమే చేసింది.. రెడ్డి సామాజిక వర్గం వదిలేసినట్టుగా కనిపిస్తోంది. ఎందుకు అంటే కమ్మ సామాజిక వర్గం 2014 నుంచి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గం అధికారంలో ఉన్నది. తెలంగాణలో లేదు. ఆంధ్రాలో ఉంది కాబట్టి ఇలాంటి ప్రమాదం లేదనుకున్నారు.. 2019లో వచ్చేసరికి రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారిపోయాయి.

తెలంగాణలో కేసీఆర్ కొనసాగారు ఆంధ్రాలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో కమ్మ సామాజిక వర్గం ఏకమై ఈసారి కసిగా ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఉన్న కమ్మవారు వచ్చి మరి ఓటు వేసినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తపించారు. 2019లో రెడ్డి సామాజిక వర్గం ఏకమైంది ఎందుకంటే.. రెడ్ల కత ముగిసిపోతోందా అన్న అంశంతో 2014లో ఇక్కడ చంద్రబాబు అక్కడి కేసీఆర్.. రావడం ఒకపక్క కమ్మవారు మరొక పక్క వెలమవారు.. దీంతో రెడ్డి సామాజిక వర్గం అధికారానికి దూరమైంది.

ఆకసితోనే 2019లో జగన్ కి రెడ్డి కాస్ట్ భారీ సపోర్టు చేసింది.. ఎంతలా అంటే రాయలసీమలో  టిడిపికి కంచుకోటగా ఉన్న సీట్లు అన్నిటిని కూడా బద్దలు కొట్టేసింది. రాయలసీమ నెల్లూరు ప్రకాశం రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్నచోట దాదాపుగా ఘనవిజయం అనేకంటే అధ్బుతమైన విజయాన్ని సాధించింది. కానీ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఎల్లో మీడియా వంటి వారు రెడ్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఊదరగొడుతూ ఉండడంతో జగన్ మాత్రం రెడ్లను పక్కనపెట్టి.. నాన్ ప్రయారిటీ పోస్టులలో రెడ్లను పక్కనపెట్టి ప్రియారిటి పోస్టులలో ఇతర కులాల వారిని తీసుకురావడం జరిగింది.

అయితే ఈ విషయం చాలామంది రెడ్లకు నచ్చలేదని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో కమ్మ సామాజిక వర్గం వారు సంపాదించుకున్నారు తెలంగాణలో వెలయ సామాజిక వర్గానికి సంబంధించిన వారు సంపాదించుకున్నరు. ఇక్కడ జగన్ వచ్చిన తర్వాత రెడ్లకు తిననివ్వలేదని కసి బాగా పెరిగిపోయింది.. వాటికి తోడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎన్నికయ్యారు.. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే రెడ్డి సామాజిక వర్గం ముఖ్యంగా రాయలసీమ నెల్లూరు వంటి ప్రాంతాలలోని ఎక్కువ సీట్లు తగ్గినట్టుగా కనిపిస్తోంది. మరి రెడ్లు ఈసారి జగన్ ను వదిలేసారా.. ఎగ్జాక్ట్ పోల్స్ సందర్భంగా తేలుతుంది. ప్రస్తుతానికైతే ఎగ్జిట్ పోల్స్ ను చూస్తే రెడ్డి సామాజిక వర్గం మొత్తం దూరం అవ్వలేదు కానీ 17 నుంచి 20 లేదా 25% దూరమైనట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: