ఎగ్జిట్ పోల్ : సర్వేలన్నింటిలో ఆర్జీవీ సర్వే వేరయ్య..!

FARMANULLA SHAIK
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఎన్నికల్లో సర్వశక్తులూ పోరాడాయి. వైనాట్ 175 అంటూ వైసీపీ రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పోరాడగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న టీడీపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే కసితో కూటమిగా పోటీ చేసింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాత్రి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలలో తెలుగుదేశం కూటమికి అనుకూలంగా కొన్ని సర్వే సంస్థలు రిపోర్టులను ఇచ్చాయి.అదే స్థాయిలో వైసిపి పార్టీకి కూడా చాలా సంస్థలు అనుకూలంగా ఇవ్వడం మనం చూసాం. దీంతో ఏపీ ప్రజలు ప్రస్తుతం గందరగోళం పరిస్థితుల్లో ఉన్నారు. ఆరా మస్తాన్ వంటి సర్వే ఏజెన్సీలు వైసీపీదే అధికారమని తేల్చగా.. రైజ్, పీపుల్స్ పల్స్, చాణక్య ఎక్స్ వంటి సంస్థలు కూటమిదే విజయమని అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో ఏ సర్వే సరైన ఫలితాన్ని అంచనా వేసిందనే అయోమయంలో ఏపీ జనం పడిపోయారు. దీనిపై క్లారిటీ రావాలంటే జూన్ నాలుగో తేదీ వరకూ ఆగాల్సిందే. అయితే ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. నేను ఇలాంటి సర్వేలు నమ్మనని అత్యంత ఖచ్చితమైన సర్వే నా దగ్గర ఉందని సడన్ షాక్ ఇచ్చారు.ఏదైనా సర్వే తప్పు కావచ్చు కానీ ఇది 100% సరైనది. నా బహిరంగ సవాలు విసిరారు.నా సర్వేలో తేలింది ఏమనగా ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలలో  కచ్చితంగా వైసీపీకి  0-175 వస్తాయని అలాగే కూటమికి కూడా అదే తరహాలో 0-175 వస్తాయని జోస్యం పలికారు.ఇంకోవైపు పార్లమెంట్ సీట్స్ పరంగా అధికార పార్టీ వైసీపీకి 0-25 వస్తాయని, కూటమికి కూడా అలాగే 0-25 వస్తాయని సోషల్ మీడియా ద్వారా చెప్పారు.రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే ఆయన వైఎస్ జగన్కు అభిమాని అని అందరికీ తెలిసిందే సంగతే. వైసీపీకి మద్దతుగా ఆయన చేసిన పోస్టులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి.అలాగే వైఎస్ జగన్ బయోపిక్ సైతం సినిమాలుగా రూపొందించి విడుదల చేశారు వర్మ. ఈ క్రమంలోనే టీడీపీతోనూ, టీడీపీ నేతలతోనూ వైరం పెంచుకున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అనేక జాతీయ సంస్థలు కూటమికి మద్దతుగా ఫలితాలను ప్రకటించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: